Skip to main content

Govt School Education: సర్కారు బడుల్లో ఆధునిక విద్య.. జగన్‌ ప్రభుత్వం వచ్చాకే..!

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక మాతృ భాషకు ప్రాధాన్యమిస్తూనే.. ఇంగ్లీష్‌ మీడియంను తీసుకొచ్చింది.
Studies of Government School students with Modern Education

గుంటూరు: సర్కార్‌ బడుల్లో పలకా బలపం నుంచి మొదలైన ప్రాథమిక విద్య.. పెన్నూ పేపరుతో ఉన్నత పాఠశాల విద్య పూర్తయ్యేది. మా తెలుగు తల్లికి వందనం అంటూ.. పూర్తిగా మాతృ భాషలోనే పాఠశాల విద్యను పూర్తి చేసిన విద్యార్థులు అనంతరం ఉన్నత చదువుల్లో ఇంగ్లీష్‌ మాధ్యమాన్ని అందుకునేందుకు ఒకింత ఇబ్బంది పడేవారు. కంప్యూటర్‌ శిక్షణ, సాంకేతిక విద్య అనేది అందని ద్రాక్షే. ఇది గతం.

Distance Education: దూర విద్యలో ఇగ్నో ఆధునిక కోర్సులు.. దేశ వ్యాప్తంగా స్థానం ఇది!

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక మాతృ భాషకు ప్రాధాన్యమిస్తూనే.. ఇంగ్లీష్‌ మీడియంను తీసుకొచ్చింది. సాంకేతిక విద్యను అందిపుచ్చుకునేందుకు 8వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను అందజేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు దానిని అందిపుచ్చుకుంటున్నారు.

AP 10th Class Supplementary Exam Dates: టెన్త్‌ ఫలితాల్లో ఫెయిలైన వారికి మరో ఛాన్స్‌.. సప్లిమెంటరీ పరీక్షల తేదీలు విడుదల

తరగతి గదిలో బ్లాక్‌ బోర్డుపై రాసేందుకు చాక్‌ పీస్‌ ముక్కలు లేని దీనమైన పరిస్థితుల నుంచి ప్రస్తుతం ఆధునిక సౌకర్యాలతో కూడిన సాంకేతి విద్యను విద్యార్థులు ఉచితంగా అందుకుంటున్న పరిస్థితితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. విద్యా వ్యవస్థలో గతంలో ఎన్నడూ చూడని మార్పులను సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన తీరును సమాజం చూస్తోంది. వసతుల లేమి, సమస్యలతో కునారిల్లుతున్న సర్కారు బడులను నాడు–నేడు కార్యక్రమం ద్వారా సర్వాంగ సుందరంగా ఆధునీకరించి, పేద విద్యార్థులను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దుతున్నారు.

AP 10th Class Results Live Updates: పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి.. ఈసారి రికార్డు స్థాయిలో..

రెండేళ్లలో 24,608 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు

గుంటూరు జిల్లాలోని 181 ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేసింది. 2022–23 విద్యా సంవత్సరంలో 12,127 మంది, 2023–24లో 12,481 మంది విద్యార్థులు ట్యాబ్‌లు అందుకున్నారు. క్యారీయింగ్‌ కేస్‌, ఓటీజీ కేబుల్‌, మెమోరీ కార్డు, బైజూస్‌ కంటెంట్‌తో కలిపి ఒక్కో విద్యార్థికి రూ.33వేలు వ్యయంతో ట్యాబ్‌ను అందించింది. ఈ విధంగా రెండేళ్లలో గుంటూరు జిల్లాలోని 24,608 మంది విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీకి రూ.81.20 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.

బైజూస్‌ కంటెంట్‌తో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్‌లు ఇంగ్లిష్‌ మీడియంకు తోడైన సాంకేతిక పరిజ్ఞానం విద్యా రంగంలో సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక మార్పులు జిల్లాలో రెండేళ్లలో 24,608 మంది విద్యార్థులకు అందజేత రూ.81.20 కోట్లు వెచ్చించిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

UPSC Topper: యూపీఎస్సీ టాపర్‌పై 'ఆనంద్ మహీంద్రా' ప్రశంసల జల్లు.. ఎమ‌న్నారంటే..!

చదువు విలువ తెలిసిన సీఎం జగన్‌ సార్‌

మాది మధ్య తరగతి కుటుంబం. నా భర్త దుర్గాసింగ్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేస్తున్నారు. మా కొడుకుని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నాం. ఏటా మాకు అమ్మ ఒడి పథకం కింద నగదు అందుతోంది. పిల్లలకు విద్యా కానుక కిట్‌తో పాటు పాఠశాలలోనే గోరుముద్ద పేరుతో పౌష్టికాహారంతో కూడి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఇప్పుడు ట్యాబ్‌ను ఉచితంగా ఇవ్వడం ద్వారా సీఎం జగన్‌ సార్‌ చదువుకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది.

– మీరాబాయి, విద్యార్థి శివలక్ష్మణ్‌ తల్లి

Flagship Exam: సాఫీగా సాగిన ఫ్లాగ్‌షిప్‌ పరీక్షలు.. ఈ రెండు కేంద్రాల్లో హాజరు ఇలా!

ట్యాబ్‌తో పరిజ్ఞానం పెంపు

మా నాన్న శ్రీను ఆటోడ్రైవర్‌. ఐదో తరగతి వరకు ప్రైవేటు స్కూల్లో చదివించారు. అక్కడ ఫీజులు కట్టలేక అమ్మానాన్న చాలా ఇబ్బందులు పడ్డారు. ఆరో తరగతిలో గుంటూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఇక్కడ వసతులు ఎంతో బాగున్నాయి. ట్యాబ్‌ను ఉచితంగా ఇచ్చారు. అందులోని కంటెంట్‌తో జ్ఞానం పెంపొందించుకోవచ్చు.

– ఎ.చందన, 8వ తరగతి

UGC NET 2024 Notification: యూజీసీ నెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. జూన్‌ 16న దేశ వ్యాప్తంగా పరీక్ష

సాంకేతిక చదువుకు దోహదం

మా నాన్న నజీర్‌ బైక్‌ మెకానిక్‌. ప్రైవేటు స్కూల్లో చదివించే స్తోమత లేక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఇక్కడ ప్రైవేటు స్కూల్‌ కంటే ఎంతో మెరుగైన వసతులు ఉన్నాయి. సీఎం జగన్‌ మామయ్య ఇచ్చిన ట్యాబ్‌ సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతోంది.

–ఫేక్‌ ఆఫ్రీన్‌, 8వ తరగతి విద్యార్థిని

Published date : 22 Apr 2024 03:07PM

Photo Stories