విద్యార్థులు ప్రజాసేవపై దృష్టిపెట్టాలి
Sakshi Education
కరీంనగర్‌సిటీ: విద్యార్థులు కేంద్ర, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, ప్రజాసేవపై దృష్టిపెట్టాలని వాగేశ్వరి డిగ్రీ, పీజీ కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్‌రెడ్డి తెలిపారు.
కరీంనగర్‌లోని వాగేశ్వరి కాలేజీ విద్యార్థులు ఫిష్టాఫ్యుషన్ పేరుతో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్‌రెడ్డి, ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ బుర్ర మధుసుదన్‌రెడ్డి హాజరయ్యారు. గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని తెలిపారు. మధుసుదన్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ అవసరమని సూచించారు. ప్రిన్సిపాళ్లు సతీశ్‌గౌడ్, లింగమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ చెన్నమల చైతన్య, డైరెక్టర్ నరేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ఏవో నిజాముద్దీన్ పాల్గొన్నారు.
Published date : 09 Aug 2023 03:50PM