Telangana: విద్యార్థులకు క్రీడలు కూడా ఉండాలి
Sakshi Education
చదువుతోనే విద్యార్థులకు నడిపించవద్దు అని వాళ్ళకు విద్య ఎంత అవసరమో క్రీడా సమయం కూడా అంతే అవసరం అంటూ విద్యార్థులతో క్రీడా కార్యక్రమాలను ప్రారంభించారు అథ్లెటిక్స్ కోషాదికారి.
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులు పాఠశాల్లో చదువుతో పాటు క్రీడలకు సమయం కేటాయించాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కోషాదికారి అమరీష్ అన్నారు. ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ క్రికెట్ టోర్నీని స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్‌లో శనివారం ఎస్పీ కార్యాలయ ఆర్‌ఐ శేఖర్‌బాబు, ఎస్‌ఐ శివశంకర్‌తో కలిసి ప్రారంభించారు.
అనంతరం గ్రూప్–ఏ, గ్రూప్–బి ల నుంచి నాలుగు లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ నర్సింహులు, నిర్వహకులు రమణ, కోచ్ హారిక, నర్సింహులు, పీఈటీలు అక్తర్‌పాషా, పర్విన్, రాధిక, అజిజ్‌గౌడ్, నాగేష్ పాల్గొన్నారు.
Published date : 27 Aug 2023 02:04PM