Medals for female students: ఈ పోటీల్లో విద్యార్థినిలకు 17 పతకాలు
Sakshi Education
కారేపల్లి: ఖమ్మంలో ఇటీవల జరిగిన ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కారేపల్లి మోడల్ స్కూల్, కళాశాల విద్యార్థినులు సత్తా చాటారు. ఈ పోటీల్లో తమ విద్యార్థినులు వివిధ విభాగాల్లో 17 పతకాలు సాధించారని ప్రిన్సిపాల్ ఎం.డీ.అక్తర్ తెలిపారు. విద్యార్థినులు సాత్విక, నిక్షిత, ప్రత్యూష, కావ్య, దివ్య, అనిత, మానస, అక్షయ, ప్రసన్న, వర్షిత, పల్లవి, మాధురిని సోమవారం ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
Published date : 12 Sep 2023 06:15PM