School Inspection: కేజీబీవీ పాఠశాలలో తనిఖీ..
Sakshi Education
పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన డీఈఓ అక్కడి వసతులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల కోసం వారిని ప్రోత్సాహించారు..
నక్కపల్లి: మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్‌ను డీఈవో వెంకటలక్ష్మమ్మ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు ఎలా జరుగుతున్నాయని పాఠశాల విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారిలో ఎంత మంది ఉత్తీర్ణులవుతారని ప్రశ్నించడంతో తామంతా పాస్ అవుతామంటూ విద్యార్థులు చెప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
Results Released: బీ ఫార్మసీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
విద్యార్థినులంతా క్రమశిక్షణ కలిగి, పరీక్షలకు బాగా ప్రిపేర్ కావడం పట్ల ఆనందించారు. పదో తరగతి తర్వాత విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ పనితీరును అభినందించారు.
Online Admissions: ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
Published date : 23 Mar 2024 11:10AM