Online Admissions: ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
Sakshi Education
కళాశాల ప్రవేశానికిక దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనను విడుదల చేశారు ఏపీఆర్‌జేసీ కళాశాల ప్రిన్సిపాల్.
పరిగి: ఏపీఆర్‌జేసీలో ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు పరిగి మండలం కొడిగెనహళ్లిలోని ఏపీఆర్‌జేసీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని ఏడు జూనియర్ కళాశాలలతో పాటు నాగార్జున సాగర్‌లోని డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే ఏపీఆర్‌ఎస్ సాధారణ, మైనార్టీ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశంతో పాటూ 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాత పరీక్ష ఆధారంగా విద్యార్థులకు వచ్చిన మార్కుల్లో మెరిట్‌ను పరిగణలోకి తీసుకొని సీట్లను భర్తీ చేయనున్నారు.
Published date : 23 Mar 2024 10:32AM
Tags
- online applications
- APRJC
- intermediate admissions
- degree colleges
- admissions
- students education
- APRJC Principal
- Srinivas Rao
- Entrance Exams
- Education News
- Sakshi Education News
- ananthapur news
- Academic year 2024-25
- Online application process
- Parigi APRJC Admission
- Inter colleges Kodigenahalli
- Srinivasa Rao statement
- Degree colleges Nagarjuna Sagar
- Junior colleges admission
- sakshieducationlatest admissions
- Latest admissions