Jagananna Vidya Deevena Scheme: జగనన్నవిద్యాదీవెన రూ.24.85 కోట్లు
తుమ్మపాల: జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా 37,609 మంది విద్యార్థులకు రూ.24 కోట్ల 85 లక్షల 89వేల 179 జమ చేస్తున్నట్లు కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా నగరిలో సోమవారం వర్చువల్ విధానంలో విద్యాదీవెన నిధిని బటన్ నొక్కి ప్రారంభించగా.. గుండాలవీధి సచివాలయం నుంచి కలెక్టర్ లబ్ధిదారులు, అధికారులతో కలిసి కార్యక్రమాన్ని వీసీలో వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నమూనా చెక్కును అందించారు. 2022–23 త్రైమాసికానికి సంబంధించి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో వెనుకబడిన తరగతులకు చెందిన 33 వేల 974 మందికి రూ.22 కోట్ల 35 లక్షల 94 వేల 498, సాంఘిక సంక్షేమశాఖ కింద 2,885 మందికి రూ.2 కోట్ల 4 లక్షల 56 వేల 704, గిరిజన సంక్షేమశాఖ ద్వారా 519 మందికి రూ.28,38,652, ఈబీసీ కింద 1,307 మందికి రూ.99,60,063, కాపు సంక్షేమం కింద 2,823 మందికి రూ.1,79,47,654, ముస్లిం మైనార్టీ కింద 187 మందికి రూ.13,63,630, క్రిస్టియన్ మైనార్టీ కింద 44 మందికి రూ.3,35,695 జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ భీశెట్టి వరాహ సత్యవతి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అజయ్‌బాబు, బీసీ సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, గిరిజన సంక్షేమశాఖ అధికారి నాగశిరీష పాల్గొన్నారు.