Jagananna Vidya Deevena: విద్యా దీవెన వరమనీ
బాపట్ల అర్బన్: పేద విద్యార్థుల ఉన్నత చదువు మధ్యలో ఆగిపోకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం విద్యాదీవెన పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తోంది. వందశాతం ఫీజులను సర్కారే భరిస్తోంది. క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో నిధులు జమ చేసింది. తాజాగా మూడో విడత నగదును సోమవారం జమ చేయనుంది.
నగరి వేదికగా..
చిత్తూరు జిల్లా నగరి వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విద్యాదీవెన నగదును బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రంజిత్‌బాషా, లబ్ధిదారులు వీక్షించనున్నారు.
నేడు మూడో విడత జమ
జిల్లాలో 28,484 మంది విద్యార్థులకు ప్రయోజనం రూ.23.39 కోట్ల మేర లబ్ధి సర్వత్రా ఆనందం
మూడు విడతలుగా ఇలా..
తేదీ | లబ్ధిదారులు | మొత్తం(రూ.కోట్లలో) |
మార్చి 19, 2023 | 31,046 | 26.25 |
మే 24, 2023 | 19,944 | 21.88 |
తాజాగా నేడు | 25,773 | 23.39 |
జగనన్న విద్యా దీవెన మూడో విడత జమ ఇలా..
సామాజికవర్గం | విద్యార్థుల లబ్ధిదారులైన మొత్తం సంఖ్య | తల్లుల సంఖ్య | (రూపాయల్లో) |
ఎస్సీ | 8,399 | 7,534 | 7,10,75,975 |
ఎస్టీ | 978 | 887 | 72,89,163 |
బీసీ | 10,033 | 9,070 | 7,92,54,869 |
ఈబీసీ | 4,867 | 4,483 | 4,22,41,973 |
ముస్లిం మైనార్టీ | 1,737 | 1,583 | 1,32,98,872 |
కాపు | 2,336 | 2,097 | 1,95,27,446 |
క్రిస్టియన్ మైనార్టీ | 134 | 119 | 12,84,164 |
మొత్తం | 28,484 | 25,773 | 23,39,72,462 |