Skip to main content

Eklavya School Admission: ‘ఏకలవ్య’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. ఖాళీలు ఇలా..

పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ విద్యాలయంలో 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్‌ ఫిబ్ర‌వ‌రి 28న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
ITDA Parvathipuram   Admissions open for 6th to 9th classes at Ekalavya Model Residential Vidyalaya  EkalavyaModelInvitation of applications for admission to Ekalavya    Ekalavya Model Residential Vidyalaya admissions

ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల మార్చి 31లోగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీటీడడబ్ల్యూ గురుకులం.ఏపీ.జీఓవీ.ఇన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 13న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కన్వీనర్‌ ఫోన్‌ 6303508032, గురుకులం సెల్‌ ఇన్‌చార్జ్‌ 9490971090 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

చదవండి: Uttarakhand Cultural Fest: జాతీయ‌స్థాయి ఫెస్ట్‌లో ఏక‌ల‌వ్య విద్యార్థి

పాఠశాలలో ఖాళీలు ఇలా ఉన్నాయి

  • ఏకలవ్య కురుపాంలో 6వ తరగతిలో 30 (బాలురు),30 బాలికలతోపాటు 7వ తరగతిలో ఒకటి బాలికలు, 9వ తరగతిలో 8 (బాలురు),3 (బాలికలు)కు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
  • ఏకలవ్య అనసభద్ర పాఠశాలలో 6వ తరగతిలో 30(బాలురు), 30 (బాలికలు)తోపాటు 7వ తరగతిలో 3 (బాలురు),4 (బాలికలు), 8వ తరగతిలో 2 (బాలురు), 1(బాలికలు),9వ తరగతిలో 1(బాలురు)
  • ఏకలవ్య కొటికపెంట పాఠశాలలో 6వ తరగతిలో 30(బాలురు),30(బాలికలు), 7వ తరగతిలో 1(బాలురు), 1(బాలికలు), 8వ తరతిలో7(బాలురు), 9వ తరగతిలో 5(బాలురు)
  • ఏకలవ్య గుమ్మలక్ష్మీపురంలో 6వ తరగతి 30(బాలురు), 30(బాలికలు),7వ తరగతిలో 3(బాలురు) సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Published date : 29 Feb 2024 05:11PM

Photo Stories