IB Syllabus in AP Govt. Schools: ఐబీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఏంఓయూ!!
సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐబీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఏంఓయూ కుదుర్చుకుంది. విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మాట్ కాస్టెల్లో, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఏపీ సీఎం జగన్ సింగపూర్, వాషింగ్టన్, జెనీవా, యూకేలకు చెందిన ఐబీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
జగనన్న 'సివిల్ సర్వీసెస్' ప్రోత్సాహకం పేరుతో మరో పథకం.. రూ.50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం..
ఇంటర్నేషనల్ బాకలారియేట్, IB విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి పెడుతుంది. పాఠ్యప్రణాళికలో చాలా పాఠ్యేతర మరియు సహ-పాఠ్య కార్యకలాపాలు కూడా ఉన్నాయి.
జీపీఎస్ బిల్లు అమలుకు ఆమోదం..
ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు ఆమోదం. ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలి. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్ మెంట్ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం
ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్. ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు. ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుంది.
ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీలతో టై అప్ ఉండేలా చట్ట సవరణ. దీనివల్ల జాయింట్ సర్టిఫికేషన్‌కు వీలు కలుగుతుంది. ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి. దీని పిల్లలకు మేలు జరుగుతుంది.