Skip to main content

Teachers Excellence: గురువుల‌కు గౌర‌వంతో స‌త్కారాలతో పాటు అభినంద‌న‌లు

ఉపాధ్యాయుల వృత్తికి అమిత‌మైన గౌర‌వాన్ని అందించి, స‌న్మానాలు స‌త్కారాలు చేసారు. ఉపాధ్యాయుల గురించి ఒక్కొక్క‌రూ త‌మ మాటల్లో వివ‌రంగా తెలిపారు. విద్యార్థుల చ‌దువు, ఉపాధ్యాయుల శిక్ష‌ణ గురించి కూడా మాట్లాడారు. మ‌రిన్ని పూర్తి వివ‌రాలు చ‌ద‌వండి...
felicitating and honouring with great words for teachers
felicitating and honouring with great words for teachers

సాక్షి,ఎడ్యుకేష‌న్: ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఎనలేని గౌరవం, గుర్తింపు ఉందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లాస్థాయిలో మంగళవారం స్థానిక కాఫీ అతిథి గృహంలో నిర్వహించారు. ముందుగా రాధాకృష్ణన్‌ చిత్రపటం వద్ద కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో అభిషేక్‌, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Educational Development: శాస్త్రీయ‌ప‌ర‌మైన విద్యావిధానం అమ‌లు

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు జిల్లాను ఆగ్రగామిగా నిలిపేందుకు ఉపాధ్యాయులంతా ఎంతో శ్రమిస్తున్నారన్నారు. వారంతా అభినందనీయులన్నారు. గిరిజన ప్రాంత పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. నాడు–నేడు ద్వారా మరిన్ని పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.అన్ని గ్రామాల్లో విద్యాభివృద్ధి కార్యక్రమాలు విజయవంతానికి ఉపాధ్యాయులంతా అంకితభావంతో పనిచేయాలని కోరారు.ఉత్తమ ఉపాధ్యాయులందరూ తమ బాధ్యతను మరింత రెట్టింపు చేసుకుని విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
టెన్త్‌లో మరింత మెరుగైన ఉత్తీర్ణత:

ఐటీడీఏ పీవో అభిషేక్‌

ఉపాధ్యాయులంతా గిరిజనుల విద్యకు శ్రమిస్తున్నారని టెన్త్‌లో ఫలితాల శాతం మరింత పెరగాలని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ సూచించారు. డ్రాపౌట్‌ విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. బడిఈడు పిల్లలంతా బడిలోఉండాలనే ఆశయంతో ఉపాధ్యాయులు పనిచేయాలని ఆయన కోరారు.
మరిన్ని ప్రోత్సాహకాలు పొందాలి:

డీఈవో సలీంబాషా

ఉపాధ్యాయులంతా అంకిత భావంతో పనిచేస్తున్నారని, విద్యాభివృద్ధికి మరింత శ్రమించాలని జిల్లా విద్యాశాఖాధికారి సలీంబాషా అన్నారు. భవిష్యత్తు మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించి ప్రోత్సాహకాలు పొందాలని ఆకాంక్షించారు. గత విద్యాసంవత్సరంలో టెన్త్‌, ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చాయని అది స్ఫూర్తితో కొనసాగించాలని కోరారు.
ఉపాధ్యాయుల కృషితోనే మంచి ఫలితాలు:

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ఉపాధ్యాయుల కృషితోనే విద్యార్థులు ఉన్నత చదువులు,ఉద్యోగాలలో రాణిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లోను ఉపాధ్యాయులంతా పాఠశాలల నిర్వహణ,నాణ్యమైన విద్యాబోధనకు శ్రమిస్తున్నారని, వారందరికి అభినందనలు తెలిపారు.


శాలువాలతో సత్కరించి..

జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న పలు మండలాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, కేజీబీవీ పాఠశాలల ప్రత్యేకాధికారులు, సీఆర్‌టీలు, పీఈటీ, సర్వశిక్షా విభాగం సిబ్బందికి ఉత్తమ అవార్డులను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో అభిషేక్‌, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఎంపీపీ రత్నకుమారి పంపిణీ చేశారు. శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎస్‌.రత్నకుమారి, డీసీడీవో సూర్యకుమారి, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తదతరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌
ఘనంగా గురుపూజోత్సవం
ఉత్తమ సేవలకు సత్కారం

Published date : 06 Sep 2023 04:48PM

Photo Stories