Aptitude Test: ప్రతిభా పరీక్షలో విద్యార్థులు పాల్గొనాలి
మార్కాపురం టౌన్: ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ప్రతిభా పరీక్షకు అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యేలా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యాసరచన, క్విజ్, ఫోక్ డ్యాన్స్ విభాగాల్లో ఈ నెల 23న మార్కాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాసరచనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ బహుమతులు వరుసగా రూ.10 వేలు, రూ.6 వేలు, రూ.3 వేలు, వెయ్యి రూపాయలు, క్విజ్ పోటీల్లో విజేతలకు వరుసగా రూ.15 వేలు, రూ.8 వేలు, రూ.5 వేలు, రూ.2 వేలు, ఫోక్ డ్యాన్స్ విజేతలకు వరుసగా రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.6 వేలు, రూ.4 వేలతోపాటు కన్సోలేషన్ బహుమతులిస్తామని వివరించారు. పోటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ముందస్తుగా సంసిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఇగ్నైట్ యంగ్ మైండ్స్ జిల్లా స్థాయి పోటీల ప్రాధాన్యతను కలెక్టర్, డీఈఓ, డీవైఈఓలకు వివరించామని, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని కోరారు. రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్ లింకు బ్రోచర్‌లో పొందుపరిచామని, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేర్లు నమోదుచేసుకోవాలని సూచించారు. హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మార్కాపురం డీవైఈఓ చంద్రమౌలీశ్వర్, ఎంఈఓలు రాందాస్‌నాయక్, టి.శ్రీనివాసులు, సుజాత, సుబ్రహ్మణ్యం, హెచ్‌ఎంలు సీహెచ్ మల్లికార్జున, సుధాకర్, ఇగ్నైట్ యంగ్ మైండ్స్ సభ్యులు మురారి వెంకటేశ్వర్లు, మండ్లా రామాంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చదవండి: AP Model Schools: మోడల్ స్కూల్ టీచర్ ఉద్యోగాల పేరిట టోకరా