Skip to main content

Navodaya Entrance Exam: నవోదయ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు..

విద్యా‍ర్థలుకు నిర్వహించబోయే నవోదయ ప్రవేశ పరీక్షను చాలా పకడ్బందీగా చేయాలని ఆదేశాలను జారీ చేశారు విద్యాశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌..
Arrangements for Navodaya entrance exams

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో నిర్వహించబోయే నవోదయ ప్రవేశ పరీక్షను సెంటర్‌ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష కేంద్రాలను కలెక్టర్లు, డీఈఓలు, ఇతర అధికారులు తనిఖీ చేస్తారని నాగర్‌కర్నూల్‌ జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రావు తెలిపారు.

AP Anganwadi Workers Alerts : అంగన్‌వాడీలు విధులకు హాజరుకావాలి.. ప్రభుత్వం కొన్ని కోర్కెలను..

గురువారం బిజినేపల్లిలోని ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో 26 పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, కేంద్ర పరిశీలనాధికారులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని 26 కేంద్రాల్లో పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్‌ భాస్కర్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Published date : 19 Jan 2024 05:01PM

Photo Stories