Skip to main content

National Sports Meet: ఏక‌ల‌వ్య నేష‌న‌ల్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికైన విద్యార్థులు

అండ‌ర్‌-19 విభాగంలో జ‌ర‌గ‌నున్న జాతీయ స్పోర్ట్స్ మీట్‌కు ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వెల్ల‌డించారు. విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థుల ప్ర‌తిభ గురించి తెలిపారు..
Ekalavya High School students with their principal   Three students selected for National Sports Meet in Under-19 category

సాక్షి ఎడ్యుకేష‌న్: కర్ణాటకలోని మైసూర్‌లో వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఏకలవ్య నేషనల్‌ లెవెల్‌ స్పోర్ట్స్‌ మీట్‌కు తమ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు ఇప్పలపాడు ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బి.అమృత్‌ కుమార్‌ చెప్పారు.

Kala Utsav: జిల్లా స్థాయి క‌ళా ఉత్స‌వ్ పోటీలు

గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌మీట్‌ అండర్‌–19 విభాగంలో తమ పాఠశాల విద్యార్థులైన కణితి కార్తిక్‌, మడకం భరత్‌, కూరం ఐశ్వర్య అత్యంత ప్రతిభ కనపరచి జాతీయ స్థాయి స్పోర్ట్స్‌మీట్‌కు ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.

Published date : 09 Dec 2023 10:29AM

Photo Stories