Skip to main content

Dussehra Holidays 2024 : తెలంగాణ‌లో అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి దసరా సెలవులు.. మొత్తం...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి 15వ తేదీన తెరుచుకుంటాయని పేర్కొంది.
Dussehra Holidays 2024

సెలవుల తర్వాత సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హోంవర్క్‌ ఇవ్వాలని అధికారులు అన్ని పాఠశాలలప్రధానోపాధ్యాయులకు సూచించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు ద‌స‌రా పండ‌గ సెల‌వులు ఇలా..

 

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

ఈ సారి ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తం 10 రోజులు సెలవులను ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌క‌టించి ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దపండుగలో దసరా, సంక్రాంతిలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు పండ‌గ‌ల‌కు ప్ర‌భుత్వం ప్ర‌తి ఏడాది భారీగా సెల‌వులు ఇస్తున్న విష‌యం తెల్సిందే. ఈ పండుగలను తెలుగు ప్రజలు అంగరంగవైభవంగా చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని సూళ్లకు ప్రభుత్వం ద‌స‌రా పండుగ సెలవులను ప్రకటించింది. ఈ మేర‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ అకడమిక్ క్యాలెండర్‌లో గ‌తంలో విడుదల చేసిన విష‌యం తెల్సిందే.

అలాగే అక్టోబ‌ర్ నెల‌లో మ‌రో పండ‌గ దీపావళి అక్టోబరు 31వ తేదీ (గురువారం) అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు ఉంటుంది. అయితే ప్ర‌భుత్వ‌,  ప్రైవేట్‌ ఆఫీస్‌ల‌కు మాత్రం కేవ‌లం ద‌స‌రా పండ‌గ రోజు మాత్ర‌మే... సెల‌వులు ఉండనున్న‌ది.

Follow our YouTube Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 20 Sep 2024 05:49PM

Photo Stories