Skip to main content

విజ్ఞానశాస్త్ర స్వభావం - పరిధి

జీవశాస్త్రం - బోధనా పద్ధతులు - విజ్ఞానశాస్త్ర స్వభావం - పరిధి
ఆదిమానవుడి కాలం నుంచి విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది. ఆదిమానవుడు తన ప్రాథమిక అవసరాలైన, ఆకలి, ఆచ్ఛాదన ఆవాసం కోసం పరిశీలించడం ద్వారా కొత్త విషయాలు కనుగొన్నాడు. కాబట్టి ఆదిమానవుడే మొదటి శాస్త్రవేత్త.
  • ప్రకృతి వనరుల వినియోగానికి పరిశీలన, ఆలోచన అవసరమైనవి.
  • ‘సైన్‌‌స’ అనే పదం ‘సైన్షియా’ లేదా ‘సిరే’ అనే లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. ఈ మాటలకు అర్థం ‘జ్ఞానం’. ప్రాచీన భారతీయ పదమైన ‘వేద’కు కూడా అర్థం ‘జ్ఞానం’.
విజ్ఞాన శాస్త్రం అంటే?
  • ప్రయోగాలకు పరిశీలనకు పరిమితమై తరగతి గదిలో బోధించే జ్ఞానం.
  • క్రమబద్ధమైన, వ్యవస్థీకరించిన జ్ఞానం
  • వ్యవస్థీకృతమైన లోకజ్ఞత(Common Sense)
  • విజ్ఞాన శాస్త్రంలో ప్రక్రియలు, ఫలితాలు - యథార్థాలు, సంభావ్యతలు ఉంటాయి.
  • విజ్ఞాన శాస్త్రం పరిశీలించదగిన దృగ్విషయాలపై ఆధారపడి, సత్య నిరూపణ రజువులతో కూడింది. జ్ఞానేంద్రియాల ద్వారా నమ్మకాన్ని ఏర్పరుస్తుంది.
నిర్వచనాలు:
సైన్‌‌స మ్యాన్‌పవర్ ప్రాజెక్ట్:
జ్ఞాన శాస్త్రమంటే సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమ్మేళనం.
జేమ్స్. బి. కొనాంట్: ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి చెంది, ప్రయోగాత్మక పరీక్షలు, పరిశీలనలకు మధ్య ఫలితాలనిస్తూ - పరస్పర సంబంధాలు ఉన్న భావనలు, భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం.
స్తబ్ద దృష్టితో ఆలోచిస్తే: సంబంధాలు ఉన్న సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు సమాచారం ఉన్న విభాగం.
గతిశీల దృష్టితో ఆలోచిస్తే: విజ్ఞాన శాస్త్రమంటే క్రియాత్మకత. ప్రక్రియలు పద్ధతులు, ప్రయోగాలు, అన్వేషణలు, పరిశోధనలు ఉంటాయి.
AAAS (అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్‌‌సమెంట్ ఆఫ్ సైన్‌‌స): నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మన గురించి, ఈ విశ్వం గురించి అవగాహన పెంచుకుని, సరిదిద్దుకునే ప్రక్రియే విజ్ఞానశాస్త్రం.
ఆక్స్‌ఫర్‌‌డ డిక్షనరీ: భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించి, సత్యాలను పరీక్షించడం ద్వారా వ్యవస్థీకరించిన జ్ఞానం.
కార్‌‌లపియర్ సన్:
విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు భౌతిక విశ్వమంతా ముడిపదార్థమే
అర్హీనియస్: విజ్ఞాన శాస్త్రమంటే మాపనం.
ఐన్‌స్టీన్: మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి.
క్లేడీబెర్నార్‌‌డ: కళ అంటే నేను, శాస్త్రమంటే మనం.
జేమ్స్‌రాండీ: పరీక్షల ద్వారా లభించిన, ఆధారాలతో సాధించిన జ్ఞానాన్ని మళ్లీ లభించిన తదుపరి సాక్ష్యాలతో మార్పులు తెచ్చి మరింత మెరుగుపర్చే విధానమే శాస్త్రం.
హెన్రీ పాయింకర్: ఇల్లు ఏ విధంగా సిమెంట్, ఇసుక, రాళ్లతో నిర్మితమవుతుందో విజ్ఞానశాస్త్రం సత్యాలతో నిర్మితమవుతుంది.
వెబ్‌స్టర్ డిక్షనరీ: నిగమన పద్ధతిలో ప్రయోగం, పరీక్షించడం ద్వారా ఏర్పడే జ్ఞానం.
ఎ.డబ్ల్యు. గ్రీస్: విజ్ఞాన శాస్త్రమంటే ఒక పరిశోధనా విధానం.

విజ్ఞాన శాస్త్ర నిర్మాణం:
హెన్రీ పాయింకర్, ఆర్.సి. శర్మ నిర్మాణంలో ఉన్న భవనంతో విజ్ఞాన శాస్త్రాన్ని పోల్చారు.
SA_Biology_Methodology

పునాది: సూత్రాలు, సాధారణీకరణలు
నిలువు స్తంభాలు: సిద్ధాంతాలు
అడ్డు స్తంభాలు: పద్ధతులు, ప్రక్రియలు
రాళ్లు, ఇటుకలు, సిమెంట్, ఇసుక: సత్యాలు, భావనలు
ష్యాబ్, ఫినిక్స్: విజ్ఞాన శాస్త్రాన్ని రెండు భాగాలుగా విభజించారు. .

1. సంశ్లేషాత్మక నిర్మాణం (ప్రక్రియ)

2. ద్రవ్యాత్మక నిర్మాణం (ఫలితం)

అన్వేషణలు

యదార్థాలు(సత్యాలు)

పరిశీలనలు

భావనలు

ప్రక్రియలు

సిద్ధాంతాలు

పద్ధతులు

నియమాలు

వెఖరులు

సాధారణీకరణలు

ప్రయోగాలు

సూత్రాలు

ద్రవ్యాత్మక నిర్మాణంలో అంశాల వివరణ
  1. యథార్థం (సత్యం): ప్రత్యక్షంగా పరీశీలించేది. ఎక్కడైనా ప్రదర్శించేది. జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునేది.
    ఉదా: ఆకులు పచ్చగా ఉంటాయి. వేర్లు భూమ్యాకర్షణకు అనుకూలంగా పెరుగుతాయి.
  2. భావన: పరస్పర సంబంధాలున్న సత్యాల నుంచి ఏర్పడేది.
    ఉదా: మొక్కలు జీవితాంతం పెరుగుతాయి.
    జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడి పరిసరాలపై కూడా ఆధారపడతాయి. భావనలు వయసును, వ్యక్తులను బట్టి మారుతుంటాయి.
  3. సిద్ధాంతం: నిరూపితమవకపోయినా బలమైన సాక్ష్యాధారాలున్న పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన.
    ఉదా: జీవ పరిణామ సిద్ధాంతం, భూకేంద్రక సిద్ధాంతం, కణ సిద్ధాంతం
  4. నియమం: సప్రమాణత ఉండి విస్తారంగా పరీక్షించి, నిరూపించిన సిద్ధాంతం.
    ఉదా: బహిర్గత నియమం, బాయిల్ నియమం.
  5. సాధారణీకరణం: పరస్పర సంబంధం కలిగిన యధార్థాల్లో ఉన్న సామాన్య లక్షణాన్ని తెలపడం.
    ఉదా: మల్లెపూలు రాత్రివేళ వికసిస్తాయి. సువాసన కలిగి ఉంటాయి.
    జాజిపూలు రాత్రివేళ వికసిస్తాయి. సువాసన కలిగి ఉంటాయి.
    విరజాజి పూలు రాత్రివేళ వికసిస్తాయి. సువాసన కలిగి ఉంటాయి.
    సాధారణీకరణ: రాత్రి వేళ వికసించే పూలలో సువాసన ఉంటుంది.
  6. సూత్రం: సూత్రం అనేది పరిశీలించే దృగ్విషయ వివరణ. చాలా విస్తారంగా పరిశీలించిన, ఏర్పర్చిన సామాన్యీకరణలనే సూత్రాలు అంటారు. సూత్రం విషయస్థిరీకరణకు ఉపయోగపడుతుంది.
    ఉదా: అనువంశిక సూత్రాలు, ఆర్కిమెడిస్ సూత్రం.
ప్రాకల్పన:
పరిశీలించిన సంఘటనల మధ్య ఉన్న సంబంధాల ప్రాథమిక భావన. దత్తాంశాల ఆధారంగా పరిష్కారాన్ని ఊహించడం.
ప్రాకల్పన రకాలు:
ప్రకటనాత్మక ప్రాకల్పన: భాష్పోత్సేకానికి, పత్ర రంధ్రాలకు సంబంధం ఉంది.
ప్రశ్నా ప్రాకల్పన: భాష్పోత్సేకానికి, పత్ర రంధ్రాలకు సంబంధం ఉందా?
ప్రాగుక్తీకరణ ప్రాకల్పన: భాష్పోత్సేకానికి, పత్ర రంధ్రాలకు సంబంధం ఉండవచ్చు.
శూన్య ప్రాకల్పన: భాష్పోత్సేకానికి, పత్ర రంధ్రాలకు సంబంధం లేదు.

గతంలో అడిగిన ప్రశ్నలు
1. విజ్ఞానశాస్త్ర లక్షణం కానిది? (డీఎస్సీ-02)
1) విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ
2) విజ్ఞాన శాస్త్రం సంచిత జ్ఞానం
3) విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తుంది
4) విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రయోగా త్మకంగా నిరూపించలేం
2. నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్‌‌స నిర్మా ణాన్ని పోల్చవచ్చు అన్నది? (డీఎస్సీ-02)
1) హెన్రీ పాయింకర్, ఆర్.సి. శర్మ
2) కార్‌‌ల పియర్‌సన్
3) జేమ్స్ బి. కోనాంట్
4) రిచర్‌‌డసన్
3. సాధారణీకరించిన ఊహ లేదా ఆలోచన? (డీఎస్సీ-2002)
1) యథార్థం
2) సిద్ధాంతం
3) సూత్రం
4) భావన
4. శాస్త్రీయ ప్రవచనాలు? (డీఎస్సీ-2004)
1) సత్యదూరాలు
2) సహేతుకంగా ఉండవు
3) క్రమరహితంగా ఉంటాయి
4) క్రమబద్ధంగా ఉంటాయి
5. ‘అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్‌‌స మెంట్ ఆఫ్ సైన్‌‌స’ అభిప్రాయం ప్రకారం ‘విజ్ఞానశాస్త్రం’? (డీఎస్సీ-2004)
1) ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి పొంది, తర్వాత ప్రయోగాత్మక పరీక్ష లు, పరిశీలనల ఫలితాలనిస్తూ పరస్ప ర సంబంధాలున్న భావనల, భావనా పథకాల శ్రేణి
2) నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మన గురించి, ఈ విశ్వం గురించి అవగాహన పెంచుకుని, సరిదిద్దుకునే ప్రక్రియే విజ్ఞానశాస్త్రం.
3) ప్రయోగాలు పరిశీలనలు ఉన్న విజ్ఞానం
4) క్రమబద్ధం, వ్యవస్థీకరించిన విజ్ఞానం
సమాధానాలు
1) 4 2) 1 3) 4 4) 4 5) 2

మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో ఎవరు తెలిపిన వాటిని అనువర్తిత శాఖలుగా పిలుస్తున్నారు?
ఎ) కిరణ్ - బాహ్య స్వరూప శాస్త్రం (జీవుల బాహ్య లక్షణాలను తెలిపేది)
బి) కీర్తి- సూక్ష్మజీవ శాస్త్రం (సూక్ష్మజీవుల గురించి తెలిపేది)
సి) కార్తిక్- అణుజీవశాస్త్రం (అణు స్థాయి జీవుల గురించి తెలిపేది)
డి) కారుణ్య- హార్టికల్చర్ (మొక్కల పెంపకానికి సంబంధించింది)

1) సి, డి 2) ఎ, సి 3) బి, సి 4) బి, డి
2. కింది ఏ ప్రవచనాలు హెన్రీపాయింకర్, ఆర్.సి. శర్మలు వివరించిన విజ్ఞానశాస్త్ర నిర్మాణానికి సంబంధించినవి?
ఎ) విజ్ఞాన నిర్మాణంలో సిద్ధాంతాలు నిలువు స్తంభాలుగా ఉంటాయి.
బి) విజ్ఞానశాస్త్ర నిర్మాణాన్ని.. నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చటం
సి) విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ద్రవ్యాత్మక నిర్మాణం, సంశ్లేషణాత్మక నిర్మాణం అనే విభాగాలుంటాయి.
డి) విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో సత్యాలు, భావనలను పునాదులతో పోల్చారు
1) బి, సి 2) సి, డి 3) ఎ, డి 4) ఎ, బి
3. ఆహారోత్పత్తిలో భాగంగా కింది వాటిలో ఏది జలచరాలకు సంబంధించిన అభివృద్ధిని సూచిస్తుంది?
1) హరిత విప్లవం
2) శ్వేత విప్లవం
3) నీలి విప్లవం
4) సాంఘిక విప్లవం
4. కింది నిర్వచనాల్లో సిద్ధాంతానికి సంబంధించి సరైంది?
1) పరిశీలించిన సంఘటనల మధ్య ఉన్న ప్రాథమిక భావన
2) నిరూపితంకాకపోయినా బలమైన సాక్ష్యాధారాలున్న పరిస్థితులను వివరించడానికి ప్రతిపాదన
3) చాలా విస్తారంగా పరీక్షించి, సప్ర మాణత నెలకొల్పిన సిద్ధాంతం
4) సేకరించిన సమాచారం ఆధారంగా తర్వాతి పరిణామాన్ని ఊహించడం
5. విజ్ఞానశాస్త్రంలోని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రం ప్రాథమికమైంది, ముఖ్యమైంది ఎందుకు?
1) జీవరాశుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది
2) సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది
3) జ్ఞాన విస్ఫోటనానికి మార్గం సుగమం చేస్తుంది
4) భూమిని అవగాహన చేసుకోవ టానికి సహాయపడుతుంది
6. A అనే విద్యార్థి భావనను అవగాహన చేసుకొన్నాడు. B సత్యం అంటే ఏమిటో తెలుసుకొన్నాడు. A, B ఇచ్చిన ఉదాహ రణలు సరైనవి అయితే కింది వాటిలో వేటిని ఇచ్చారు?
1) A ఆకులు పచ్చగా ఉంటాయి. B మొక్కలు పెరుగుదలను సూచిస్తాయి.
2) A పీడనం పెరిగితే ఘనపరిమాణం తగ్గుతుంది. B జీవులు శ్వాసిస్తాయి.
3) A జంతువులలో కిరణజన్య సంయోగక్రియ జరుగదు. B సరళజీవుల నుంచి సంక్లిష్ట జీవులు ఏర్పడుతాయి.
4) A మొక్కలు జీవితాంతం పెరుగు దల చూపుతాయి. B జంతువులు ప్రత్యుత్పత్తి ద్వారా తమ సంఖ్యను వృద్ధిచేసుకుంటాయి.
7. విజ్ఞానశాస్త్ర లక్షణాలను తెలుపుతూ క్రాంతి విజ్ఞానశాస్త్రం క్రమబద్దమైంది అని, వినయ్ శాస్త్రీయ ప్రవచనం అని, భరత్ ఊహాజనితమైంది అని తెలిపారు. ఎవరెవరు సరైన లక్షణాలను తెలిపారు?
1) క్రాంతి తప్పు- వినయ్, భరత్‌లు ఒప్పు
2) క్రాంతి, వినయ్‌లు ఒప్పు- భరత్ తప్పు
3) క్రాంతి భరత్‌లు ఒప్పు- వినయ్ తప్పు
4) క్రాంతి, భరత్, వినయ్ ముగ్గురూ తప్పు
సమాధానాలు

1) 3

2) 2

3) 3

4) 2

5) 1

6) 4

7) 2

Published date : 10 Dec 2014 12:23PM

Photo Stories