Skip to main content

విటమిన్లు-న్యూనతా వ్యాధులు

విటమిన్లు: విటమిన్ (VITAMIN).. VITAL, AMINO ACIDS అనే పదాల సమ్మేళనం. VITAL అంటే అతిముఖ్యమైన అని అర్థం. విటమిన్ పదాన్ని 1912లో ఫంక్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.
  • జీవి పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత అవసరమైన కారకాలను విటమిన్లు అంటారని ఫంక్ నిర్వచించాడు.
  • తర్వాతి కాలంలో విటమిన్‌లన్నీ అమైనో ఆమ్లాలు కావని గుర్తించారు. స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ, దేహనిర్మాణంలోగానీ విటమిన్లు తోడ్పడవు. కానీ, శక్తి ప్రసరణ, జీవక్రియల నియంత్రణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కొన్ని విటమిన్లు సహ ఎంజైమ్‌లుగా పనిచేస్తాయి. విటమిన్‌ల లోపం వల్ల న్యూనతా వ్యాధులు వస్తాయి.
విటమిన్‌లు రెండు రకాలు
  1. కొవ్వులో కరిగే విటమిన్లు – A, D, E, K(శోష రసం ద్వారా సరఫరా అవుతాయి).
  2. నీటిలో కరిగే విటమిన్లు– B, C(పేగులో శోషణం చెంది, నేరుగా రక్తం ద్వారా సరఫరా అవుతాయి).
విటమిన్ A
రసాయణ నామం: రెటినాల్ (యాంటీ జిరాప్తాల్మిక్ విటమిన్)
లభించే పదార్థాలు: కాలేయం, గుడ్లు, వెన్న, పాలు, కాడ్, షార్‌‌క చేప కాలేయ నూనెలు బచ్చలికూర, తోటకూర, క్యారట్, టమోటా, గుమ్మడి, బొప్పాయి.
లోపం వల్ల కలిగే వ్యాధులు: రేచీకటి, జిరాప్తాల్మియా, శుక్ల పటలం పగలటం, చర్మం మీద పొలుసులు, కెరటోమలేసియా (శుక్లపటలం పొడిబారటం).

విటమిన్ D
రసాయణ నామం: కాల్సిఫెరాల్ (యాంటీ రాకైటిక్ విటమిన్)
లభించే పదార్థాలు: కాలేయం, గుడ్డులోని సొన, వెన్న, కాడ్, షార్‌‌క చేపల నూనె, సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల సమక్షంలో క్షీరదాల చర్మం విటమిన్ డిని సంశ్లేషించుకొంటుంది.
లోపం వల్ల కలిగే వ్యాధులు: రికెట్స్- ఎముకలు పెలుసుగా అవటం, దొడ్డికాళ్లు, పీజియన్ బ్రెస్ట్ (పక్కటెముకలు సరిగా ఎదగకపోవటం). (విటమిన్ డిను అధికంగా తీసుకుంటే వికారం, తలనొప్పి, మూత్రపిండాలు దెబ్బతినటం, మృదుకణజాలాల అస్థీకరణం జరుగుతుంది). పెద్దల్లో ఆస్టియో మలేసియా వస్తుంది.

విటమిన్ E
రసాయణ నామం: నాఫ్తోక్వినోన్/ ఫిల్లో క్వినోన్ (యాంటీ హేమరేజిక్ విటమిన్)
లభించే పదార్థాలు: ఫలాలు, కాయగూరలు, మొలకెత్తినగింజలు, మాంసం, గుడ్డుసొన, పొద్దు తిరుగుడు పువ్వు గింజల నూనె, పత్తి గింజల నూనె, గోధుమ మొలకల నూనె, నట్స్, మొక్కజొన్న.
లోపం వల్ల కలిగే వ్యాధులు: పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీల్లో గర్భస్రావం, ఎర్ర రక్తకణాల జీవిత కాల పరిమితి తగ్టటం. కండర క్షీణత.

విటమిన్ K
రసాయణ నామం:
టోకో ఫెరాల్ (యాంటీ స్టెరిలిటీ విటమిన్)
లభించే పదార్థాలు: ఆకుకూరలు, ఆవుపాలు, టమోటా, జున్ను, గుడ్లు, కాలేయం. పేగులోని సూక్ష్మజీవులు ఈ విటమిన్‌ను సంశ్లేషిస్తాయి.
లోపం వల్ల కలిగే వ్యాధులు: రక్తం ఆలస్యంగా గడ్డకడుతుంది.

విటమిన్ B1
రసాయణ నామం:
థయమిన్
లభించే పదార్థాలు: గోధుమ, వేరుశెనగ గింజలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాయగూరలు.
లోపం వల్ల కలిగే వ్యాధులు: బెరిబెరి, ఆకలి మందగించడం, ఆంత్రనాళాల్లోని గోడల నునుపు, కండరాలు పాక్షిక పక్షవాతానికి గురవడం, పెద్దల్లో పాలీ న్యూరైటిస్ (మైలిన్ తొడుగు క్షీణించడం వల్ల అసంకల్పిత ప్రతీకార చర్యలు నిలిచి పోవడం), పిల్లల్లో పెరుగుదల తగ్గడం.

విటమిన్ B2
రసాయణ నామం:
రైబోఫ్లేవిన్
లభించే పదార్థాలు: పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు
లోపం వల్ల కలిగే వ్యాధులు: నోటిపూత, నోటి మూలల్లో పగలడం, కైలోసిస్ (పెదవులు పొడిగా అవటం), గ్లాసైటిస్ (నాలుక మంటగా ఉండటం), సెబోరిక్ డెర్మటైటిస్ (ముక్కు, చెవులపై పొలుసులు రేగిన జిగట).

విటమిన్ B6
రసాయణ నామం:
పైరిడాక్సిన్
లభించే పదార్థాలు: పాలు, గుడ్లు, మాంసం, కాలేయం, చేపలు, ధాన్యాలు, చిక్కుడు జాతి కాయగూరలు. పేగులోని సూక్ష్మజీవుల ద్వారా సంశ్లేషణ జరుగుతుంది.
లోపం వల్ల కలిగే వ్యాధులు: రక్తహీనత (హైపోక్రోమిక్ మైక్రోసైటిక్), ఉద్వేగం, నాడీ మండలంలో లోపాలు, పిల్లల్లో దీనిలోపం ఎక్కువ. కన్వల్షియన్‌‌స వ్యాధి కలుగుతుంది.

విటమిన్ B12
రసాయణ నామం:
సైనకోబాలమిన్
లభించే పదార్థాలు: ఆహార పదార్థాల వల్ల లభ్యం కాదు. పేగులోని సూక్ష్మజీవులు సంశ్లేషణ చేస్తాయి.
లోపం వల్ల కలిగే వ్యాధులు: హానికర రక్త హీనత, ఎర్ర రక్తకణాలు ఉబ్బటం, ఎరిత్రోపేనియా, వెన్నుపాము క్షీణత.

ఫోలిక్ ఆమ్లం
రసాయణ నామం:
ఫోలిక్ ఆమ్లం (ఫోలాసిన్)
లభించే పదార్థాలు: కాలేయం, మాంసం, గుడ్లు, పాలు, ఫలాలు, ధాన్యాలు ఆకుకూరలు.
లోపం వల్ల కలిగే వ్యాధులు: మాక్రోసైటిక్ రక్తహీనత, అతిసారం, తెల్లరక్తకణాలు నష్టపోవడం (ల్యూకోపేనియా).

బయోటిన్
రసాయణ నామం:
బయోటిన్ (గంధకంతో కూడిన విటమిన్)
లభించే పదార్థాలు: పప్పుదినుసులు, కాయగూరలు, గింజలు, కాలేయం, మూత్రపిండాలు.
లోపం వల్ల కలిగే వ్యాధులు: కండరాల నొప్పులు, నాడీ మండలంలో తేడాలు, అలసట. పచ్చిగుడ్డులో ఎవిడిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది బయోటిన్‌ను తటస్థీకరించడం వల్ల ఈ విటమిన్ లోపం కలుగుతుంది.

నియాసిన్
రసాయణ నామం: నియాసిన్ (నికోటిన్ ఆమ్లం, యాంటీ పెల్లగ్రా విటమిన్)
లభించే పదార్థాలు: కాలేయం, గుడ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు.
లోపం వల్ల కలిగే వ్యాధులు: పెల్లగ్రా (నీళ్ల విరోచనాలు, చర్మవ్యాధి), డిమెంటియా (నాడీ వ్యవస్థలో తేడాలు).

పాంటో థెనిక్ ఆమ్లం
రసాయణ నామం: పాంటో థెనిక్ ఆమ్లం
లభించే పదార్థాలు: పేగులోని సూక్ష్మజీవులు సంశ్లేషిస్తాయి.
లోపం వల్ల కలిగే వ్యాధులు: పెరుగుదల సరిగా ఉండదు. బాల నెరుపు, వయసు త్వరగా ఉడిగినట్లవడం.

విటమిన్ C
రసాయణ నామం: ఆస్కార్బిక్ ఆమ్లం (ఆస్కార్బిక్ యాసిడ్)
లభించే పదార్థాలు: ఉసిరి, ఆకు కూరలు, తాజా బంగాళ దుంప, టమోటా, జామ, తాజా ఫలాలు.
లోపం వల్ల కలిగే వ్యాధులు: స్కర్వీ, చిగుళ్లు వాచి రక్తస్రావం కావడం, చర్మం కింద రక్త స్రావం కావడం.

మాదిరి ప్రశ్నలు
1.‘టోకోఫెరాల్’ అనే రసాయన నామం గల విటమిన్?

1) విటమిన్ A
2) విటమిన్ B2
3) విటమిన్ D
4) విటమిన్ E
2.వికారం, తలనొప్పి, మూత్రపిండాలు దెబ్బతినటం, మృదు కణజాలాల అస్థీకరణం దేనివల్ల జరుగుతుంది?
1) విటమిన్ K లోపం వల్ల
2) విటమిన్ D లోపం వల్ల
3) విటమిన్ B6 లోపం వల్ల
4) విటమిన్ Dను అధికంగా తీసుకోవటం వల్ల
3.నాఫ్తోక్వినోన్ లోపం వల్ల కలిగే సమస్య?
1) ఎముకలు పెలుసుబారుతాయి
2) ఎర్ర రక్తకణాల జీవిత కాలం తగ్గటం
3) రక్తం ఆలస్యంగా గడ్డ కట్టడం
4) ఆకలి మందగించటం
4.నోటిపూత, నోటి మూలల్లో పగుళ్లు వంటి లక్షణాలున్న రోగిలో ఏ లోపం ఉందని డాక్టర్ నిర్ణయించవచ్చు?
1) థయమిన్ లోపం
2) రైబోఫ్లేవిన్ లోపం
3) పైరిడాక్సిన్ లోపం
4) సైనకోబాలమిన్ లోపం
5.విటమిన్లు, వాటి రసాయననామాలకు సంబంధించి సరికాని జత?
1) B6 -పైరిడాక్సిన్
2) B12 - నియాసిన్
3) B2 - రైబోఫ్లేవిన్
4) B1 - థయమిన్
6. వైద్యుడు.. ఓ రోగిని ఉసిరి, ఆకుకూరలు, తాజా ఫలాలు, జామ, తాజా బంగాళాదుంపలను తరచూ ఆహారంగా తీసుకోమన్నాడు. ఆ రోగిలో ఏ విటమిన్ లోపం ఉండవచ్చు?
1) రెటినాల్
2) బయోటిన్
3) ఆస్కార్బిక్ ఆమ్లం
4) ఫోలిక్ ఆమ్లం
7. శ్వేత 8వ తరగతి విద్యార్థిని. కానీ ఆమె వెంట్రుకలు చిన్న వయసులోనే తెలుపు రంగులోకి మారిపోయాయి. ఆమెలో ఏ విటమిన్ లోపం ఉంది?
1) పాంటోథెనిక్ ఆమ్లం
2) ఆస్కార్బిక్ ఆమ్లం
3) ఫోలిక్ ఆమ్లం
4) సైనకోబాలమిన్
8.ఏడాదిలో వేసవికాలం తక్కువగా ఉండి ఎండ తక్కువగా ఉండే అతిశీతల ప్రాంతాల్లో నివసించే వారికి ఏ విటమిన్ లోపం ఉండవచ్చు?
1) టోకోఫెరాల్
2) నాఫ్తోక్వినోన్
3) బయోటిన్
4) కాల్సిఫెరాల్
9.కెరటో మలేసియా వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?
1) రెటినాల్
2) నియాసిన్
3) బయోటిన్
4) ఆస్కార్బిక్ ఆమ్లం
10.వీటిలో ఏది కొవ్వులో కరిగే విటమిన్లకు సంబంధించినది కాదు?
1) B
2) D
3) C
4) K
11.పొద్దు తిరుగుడు గింజలు, గోధుమ మొలకల నూనెలు ఏ విటమిన్ అభివృద్ధికి ఉపయోగపడతాయి?
1) కాల్సిఫెరాల్
2) టోకోఫెరాల్
3) నాఫ్తోక్వినోన్
4) ఫోలిక్ ఆమ్లం
12.ఆస్కార్బిక్ ఆమ్లం లోపం వల్ల కలిగే వ్యాధి లక్షణాలు?
1) దొడ్డికాళ్లు రావటం
2) చర్మం మీద పొలుసులు
3) నాడీ మండలంలో తేడాలు, అలసట
4) చిగుళ్లు వాచి, రక్తస్రావం కావటం
13.పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీల్లో గర్భస్రావానికి కారణ మైన విటమిన్ లోపం?
1) A
2) E
3) D
4) K
14.కెరటో మలేసియా అనేది ఏ శరీర భాగానికి సంబం ధించిన వ్యాధి?
1) చర్మం
2) కన్ను
3) మూత్రపిండాలు
4) ఎముకలు
15.పీజియన్ బ్రెస్ట్ అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?
1) రెటినాల్
2) టోకోఫెరాల్
3) కాల్సిఫెరాల్
4) నాఫ్తోక్వినోన్
16. బచ్చలికూర, తోటకూర, క్యారట్‌లను ఆహారంగా తీసుకునే వారిలో ఏ వ్యాధి రాదు?
1) బెరిబెరి
2) స్కర్వీ
3) రేచీకటి
4) రికెట్స్
17. {పత్యుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే విటమిన్?
1) సి విటమిన్
2) రైబోఫ్లేవిన్
3) టోకోఫెరాల్
4) కాల్సిఫెరాల్
18.‘గ్లాసైటిస్’ రాకుండా ఉండేందుకు ఏ విటమిన్ తీసుకోవాలి?
1) రైబోఫ్లేవిన్
2) బయోటిన్
3) నియాసిన్
4) సైనకోబాలమిన్
19.కింది వాటిలో సరికాని ప్రవచనాలు?
P) బెరిబెరి అనే వ్యాధి థయమిన్ లోపం వల్ల వస్తుంది.
Q) కె విటమిన్‌ను నాఫ్తోక్వినోన్ అని కూడా అంటారు.
R) కైలోసిస్ అనేది సి విటమిన్ లోపం వల్ల వస్తుంది
S) నియాసిన్ గంధకంతో కూడిన విటమిన్

1) P, Q
2) P, R
3) Q, R
4) R, S
20.డిమెంటియా అనే వ్యాధి ఏ వ్యవస్థలో తేడాల వల్ల వస్తుంది?
1) రక్తప్రసరణ వ్యవస్థ
2) కండర వ్యవస్థ
3) శ్వాస వ్యవస్థ
4) నాడీ వ్యవస్థ
21.మాక్రోసైటిక్ రక్తహీనతకు కారణం?
1) ఫోలిక్ ఆమ్ల లోపం
2) పచ్చిగుడ్డు తినటం వల్ల
3) నియాసిన్ లోపం
4) పాంటోథెనిక్ ఆమ్లం అధికమవటం
22.చిన్న పిల్లవాడు వయసు ఉడిగిన వృద్ధుడిలాగ కనిపించడానికి కారణం ఏ విటమిన్ లోపం?
1) టోకోఫెరాల్
2) థయమిన్
3) పాంటోథెనిక్ ఆమ్లం
4) ఆస్కార్బిక్ ఆమ్లం
23.పచ్చిగుడ్డులోని ఎవిడిన్ అనే ప్రొటీన్ వల్ల తటస్థీకరణం చెందే విటమిన్?
1) నియాసిన్
2) థయమిన్
3) పైరిడాక్సిన్
4) బయోటిన్
24. విటమిన్ ’C’కు సంబంధించి సరికానిది?
1) ఇ విటమిన్ సిట్రస్ జాతి ఫలాలు తినడం వల్ల వస్తుంది
2) ఇ విటమిన్ వల్ల పెల్లగ్రా వ్యాధి వస్తుంది
3) ఇ విటమిన్ శాస్త్రీయ నామం ఆస్కార్బిక్ ఆమ్లం
4) ఇ విటమిన్‌ను పేగు సూక్ష్మజీవులు సంశ్లేషించవు
25. విటమిన్లకు సంబంధించి సరైన జతలు?
1) పెల్లగ్రా - నియాసిన్
2) స్కర్వీ - ఫోలిక్ ఆమ్లం
3) టోకోఫెరాల్ - దొడ్డికాళ్లు
4) ఫోలిక్ ఆమ్లం - ల్యూకోపేనియా

1) 1, 2
2) 2, 3
3) 3, 4
4) 1, 4

సమాధానాలు

1) 4

2) 4

3) 3

4) 2

5) 2

6) 3

7) 1

8) 4

9) 1

10) 3

11) 2

12) 4

13) 2

14) 2

15) 3

16) 3

17) 3

18) 1

19) 4

20) 4

21) 1

22) 3

23) 4

24) 2

25) 4

Published date : 09 Dec 2014 02:42PM

Photo Stories