మొక్కల్లో ప్రత్యుత్పత్తి
Sakshi Education
- కవచ రహిత అండాలకు ఏ రెండు సరైన ఉదాహరణలు?
ఎ) లొరాంథస్
బి) ఆస్టరేసి
సి) ఒపన్షియా
డి) బెలనోఫోరా
1) ఎ, బి
2) బి, సి
3) బి, డి
4) ఎ, డి - మొక్కల కాండాల పై ఉబ్బెత్తు భాగాల నుంచి ఏర్పడనివి?
1) ఆకులు
2) వేర్లు
3) శాఖలు
4) పుష్పాలు - ‘కోరకీభవనం’ అనే శాఖీయ ప్రత్యుత్పత్తి విధానం వీటిలో దేనిలో కనిపిస్తుంది?
1) మందార
2) వైరస్
3) గులాబీ
4) ఈస్ట్ - కిందివాటిలో ఏ విత్తనాలు నీటిని శోషించి ఉబ్బుతాయి?
1) వరి
2) బఠాణీ
3) గోధుమ
4) జొన్న - కిందివాటిలో సరికాని జతను గుర్తించండి?
1)మల్లె, జాజి - వికసించే సమయం రాత్రి
2) చామంతి, గన్నేరు - రంగుల పుష్పాలు
3) తామర, సూర్యకాంతం - వికసించే సమయం రాత్రి
4) మల్లె, విరజాజి- తెలుపు, సువాసన - ‘ఇకేబానా’ అనే మాట కిందివాటిలో దేనికి సంబంధించింది?
1) పత్రాల అందమైన అమరిక
2) వేరుదుంపల అమరిక
3) ఫలాల అందమైన అమరిక
4) పువ్వుల అందమైన అమరిక - జిలేబీలను తయారుచేసేటప్పుడు రుచి కోసం జిలేబీ పిండిలో దేన్ని కలుపుతారు?
1) రైజోపస్
2) రైజోబియం
3) ఈస్ట్
4) లాక్టోబాసిల్లస్ - కిందివాటిలో ఏ ఫల పరిశీలనలో అది నిజ ఫలం కాదని తెలుస్తుంది?
1) ఆపిల్
2) జీడిమామిడి
3) టమోట
4) 1, 2 - పత్రాల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్కకు ఉదాహరణ?
1) కరివేపాకు
2) బంగాళాదుంప
3) రణపాల
4) మామిడి - ద్వికక్షియుత పరాగకోశంలో ఉండే పుప్పొడి గదుల సంఖ్య
1) రెండు
2) ఆరు
3) నాలుగు
4) ఒకటి మాత్రమే - పరాగకోశంలో ద్వికేంద్రిక స్థితి కలిగిన కణాలు?
1) టపేటం
2) బాహ్య చర్మం
3) ఎండోథీషియం
4) పైవన్నీ - ఒక వివృత బీజ మొక్కల్లోని క్రోమోజోముల సంఖ్య 32 ఉంటే ఆ మొక్కలోని సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణాలు, పరాగ కోశం, సిద్ధ బీజాల్లో క్రోమోజోముల సంఖ్యలు వరుసగా
1) 16, 16, 32
2) 32, 32, 32
3) 32, 16, 16
4) 32, 32, 16 - టెరిస్‌లో సంయోగ బీజ రకం?
1) సమ సంయోగ బీజం
2) విషమ సంయోగం
3) అసమ సంయోగ బీజం
4) ఇవేవీ కావు - కిందివారిలో ఏ శాస్త్రవేత్త పునరుత్పత్తిపై పరిశోధన చేశారు?
1) ప్లేటో
2) థియోప్రాస్టస్
3) జగదీష్ చంద్రబోస్
4) సోక్రటీస్ - సూక్ష్మ సిద్ధ బీజ చతుష్కంలోని కణాల స్థితి
1) ఏకస్థితిక
2) ద్వయస్థితిక
3) త్రయస్థితిక
4) బహుస్థితిక - ఒక విద్యార్థి తన పరిసరాల్లోని ఒక ద్విలింగ పుష్పాన్ని పరిశీలించినప్పుడు ఆ పుష్ప పరాగ రేణువులు అదే పుష్ప ఒక నిర్మాణాన్ని చేరడాన్ని గమనించాడు. అయితే అవి చేరిన నిర్మాణం, ఆ రకానికి పేరు?
1) కీలం, పరాగ విసర్గం
2) కీలాగ్రం, పరపరాగ సంపర్కం
3) అండాశయం, పరాగ సంపర్కం
4) కీలాగ్రం, ఆత్మపరాగ సంపర్కం - కేశ గుచ్ఛం కలిగిన విత్తనాలు ఉన్న కుటుంబం
1) ఫాబేసి
2) సిసాల్పినేసి
3) ఆస్టరేసి
4) లిల్లియేసి - సూక్ష్మ సిద్ధ బీజాల్లో ఎక్సైన్ అనేది
1) వ్యాధి జనకం
2) వ్యాధి కారకం
3) వ్యాధి నిరోధకం
4) ఇవేవీ కావు - విద్యార్థి ఒక పుష్ప పరిశీలనలో రక్షక, ఆకర్షక పత్రావళి మాత్రమే ఉండటాన్ని గమనించాడు. అటువంటి పుష్పం
1) ద్విలింగ పుష్పం
2) అసంపూర్ణ పుష్పం
3) సంపూర్ణ పుష్పం
4) ఏకలింగ పుష్పం - పురుష సంయోగ బీజ ద్వితీయ అభివృద్ధి కిందివాటిలో దేనిపై జరుగుతుంది?
1) అండం
2) కీలం
3) కీలాగ్రం
4) పరాగనాళం - స్పోరోపొలెనిన్‌కు సంబంధించిన పదార్థం?
1. Mg
2. N
3. P2
4. NH3 - పుష్పాల వివిధ రంగుల విధికి సరిపోయే అంశం?
ఎ) పుష్పాలను ఎండిపోకుండా చూడటం
బి) పుష్పాల తాజాదనాన్ని పెంచడం
సి) ఫలాల రంగుకు తోడ్పడటం
డి) పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడం
1) ఎ, బి
2) బి, సి
3) డి మాత్రమే
4) బి మాత్రమే - టపెటమ్ అనేది కిందివాటిలో దేనిలో భాగం?
1) అండకోశం
2) అండం
3) పరాగకోశం
4) ఫలం - ఫలదీకరణం పూర్తి అయిన తర్వాత ఫలం, విత్తనాలు ఏర్పరచే పుష్ప నిర్మాణాలు వరుసగా
1) రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు
2) కేసరాలు, అండ కోశం
3) అండం, అండాశయం
4) అండాశయం, అండాలు - చింతకాయ విత్తనం పగుల కొడితే రెండు భాగాలుగా ఏర్పడేవి?
1) అండాలు
2) స్త్రీ బీజ కణాలు
3) బీజ దళాలు
4) సహ కణాలు - శాఖీయ ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన జత
1) వేర్ల ద్వారా - గులాబీ
2) శాఖల ద్వారా - మందార
3) ఆకుల ద్వారా - కరివేపాకు
4) కాండం ద్వారా - వేప - తగినంత నీరు, గాలితోపాటు కింద ఇచ్చిన ఏ కారకం సహకరిస్తే విత్తనం మొలకెత్తుతుంది?
1) కాంతి
2) ఖనిజ లవణాలు
3) ఉష్ణోగ్రత
4) పైవన్నీ - విద్యార్థి శాఖీయోత్పత్తి అనే పాఠాన్ని చదువుతూ ఉదాహరణలు తెలుసుకుంటున్నాడు. వేర్ల ద్వారా శాఖీయోత్పత్తికి కచ్చితమైన ఉదాహరణ నేర్చుకొని ఉంటే వీటిలో ఏది చదివి ఉంటాడు?
1) రణపాల మొక్క వేర్ల ద్వారా శాఖీ యోత్పత్తికి ఉదాహరణ
2) గులాబీ వేరు ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతుంది.
3) ఉల్లి వేర్లు శాఖీయోత్పత్తి జరుపుతాయి
4) కరివేపాకు వేర్ల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతుంది - కిందివాటిలో ఏ రెండు కుటుంబాల్లో పరాగ రేణువు నుంచి ఒకటి కంటే ఎక్కువ పరాగ నాళాలు వృద్ధి చెందుతాయి?
ఎ) లెగుమినేసి
బి) కుకుర్బిటేసి
సి) మాల్వేసి
డి) యుఫర్బియేసి
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, డి - కిందివాటిలో అండకోశానికి సంబంధించనది?
1) ప్రతిపాదక కణం
2) ద్వితీయ కేంద్రకం
3) పరాగ కోశం
4) సహాయ కణం
సమాధానాలు
1) 4 | 2) 2 | 3) 4 | 4) 2 | 5) 3 | 6) 4 | 7) 3 | 8) 4 | 9) 3 | 10) 3 |
11) 1 | 12) 4 | 13) 3 | 14) 2 | 15) 1 | 16) 4 | 17) 3 | 18) 1 | 19) 2 | 20) 3 |
21) 2 | 22) 3 | 23) 3 | 24) 4 | 25) 3 | 26) 2 | 27) 3 | 28) 4 | 29) 2 | 30) 3 |
గతంలో అడిగిన ప్రశ్నలు
- అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మందారం నుంచి పొందే పిలక మొక్కల సంఖ్య (డీఎస్సీ2012)
1) ప్రతి శాఖ నుంచి ఒక్కో పిలక మొక్క
2) పిలక మొక్కలు ఏర్పడవు
3) అనేకం
4) నాలుగు - పుష్పించే మొక్కల్లో ద్వయస్థితిక క్రోమో జోముల సంఖ్య 16 అయితే దాని అంకురచ్ఛదంలోని క్రోమోజోముల సంఖ్య (డీఎస్సీ2012)
1) 10
2) 24
3) 18
4) 16 - పుష్పంలోని స్త్రీ సంయోగ బీజంలో కణాలు, కేంద్రకాలు, ఫలదీకరణాల సంఖ్య వరుసగా (డీఎస్సీ2012)
1) 3, 4, 2
2) 2, 3, 2
3) 1, 2, 2
4) 7, 8, 2 - అతి సరళ పద్ధతిలో మొక్కలను ప్రవర్థనం చేయాలనుకున్న రైతుకి అవసరం లేనివి (డీఎస్సీ2012)
1) ఆకులు
2) వేర్లు
3) పండ్లు
4) కాండాలు - మొక్క సంయుక్త బీజంలో 30 జతల క్రోమోజోములు ఉంటే ఆ మొక్క శరీర కణాలు ఒక్కోదానిలో క్రోమోజోముల మొత్తం? (డీఎస్సీ2008)
1) 15
2) 45
3) 60
4) 30 - పరాగనాళం స్త్రీ బీజ కణం దగ్గరకు కదిలేందుకు సహాయపడే కణాలు (డీఎస్సీ2008)
1) అంకురచ్ఛద కణాలు
2) సినర్జిడ్లు
3) ప్రతిపాద కణాలు
4) పురుష బీజ కణాలు - పుష్ప ఫలదీకరణ సమయంలో పూర్తిగా ఏర్పడిన పిండ కోశంలోని ఏడు కణాల అమరిక (డీఎస్సీ2008)
1) స్త్రీ బీజకణం, రెండు సినర్జిడ్లు, మూడు ప్రతిపాదక కణాలు, కేంద్రకం
2) రెండు స్త్రీ బీజకణాలు, రెండు సినర్జిడ్లు, రెండు ప్రతిపాదక కణాలు, కేంద్రకం
3) ఒక ప్రతిపాదక కణం, రెండు స్త్రీ బీజ కణాలు, మూడు సినర్జిడ్లు, కేంద్రకం
4) సినర్జిడ్, ప్రతిపాద కణాలు, మూడు స్త్రీ బీజ కణాలు, కేంద్రకం - అంకురచ్చదం గల విత్తనాలకు ఉదాహరణ (డీఎస్సీ2006)
1) బఠాణీ, చిక్కుడు
2) వరి, చిక్కుడు
3) చిక్కుడు, ఆముదం
4) వరి, ఆముదం - ఫలదీకరణం తర్వాత విత్తనంగా మారే పుష్ప భాగం (డీఎస్సీ2002)
1) అండాశయం
2) అండం
3) ప్రథమమూలం
4) బీజ దళం - మొక్కల్లో స్త్రీ సంయోగ బీజం (డీఎస్సీ2004)
1) స్థూల సిద్ధబీజ మాతృకణం
2) అండం
3) పిండ కోశం
4) సిద్ధ బీజ మాతృకణం
సమాధానాలు
1) 2 | 2) 2 | 3) 4 | 4) 3 | 5) 4 | 6) 2 | 7) 1 | 8) 4 | 9) 2 | 10) 3 |
Published date : 03 Mar 2015 06:50PM