Skip to main content

జంతువుల్లో శ్వాసేంద్రియాలు

  1. ఏ అవయవ వ్యవస్థ కణాల్లో ఉత్పత్తి అయిన కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు పంపుతుందో దాన్ని శ్వాస వ్యవస్థ అంటారు.
  2. ఏకకణ జీవులు వాయువుల పరస్పర వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరుపు
  3. కుంటాయి.
  4. భూచర జీవులన్నింటిలో ఒకే రకమైన శ్వాసావయవాలు ఉండవు.
  5. మానవులు ఊపిరితిత్తుల ద్వారా; బొద్దింక వాయునాళాల ద్వారా, వానపాము చర్మం ద్వారా శ్వాసక్రియ చేసుకుంటాయి.
  6. శ్వాస వ్యవస్థ.. జీవుల శరీర పరిమాణం, భౌమ్య ఆవాస రకం, లభించే నీరు, రక్త ప్రసరణ వ్యవస్థలపై ఆధారపడి
  7. ఉంటుంది.
శ్వాసక్రియ రకాలు

శ్వాసేంద్రియం

శ్వాసక్రియ రకం

ఉదాహరణలు

ఊపిరితిత్తులు పుపుస శ్వాసక్రియ (పల్మనరీ) క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, కొన్ని ఉభయచర జీవులు
మొప్పలు జల శ్వాసక్రియ (బ్రాంకియల్) చేపలు, కొన్ని పీతలు, కప్ప టాడ్‌పోల్, లార్వా
చర్మం చర్మ శ్వాసక్రియ క్యుటేనియస్ వానపాము, జలగ, కప్ప కొన్ని ఉభయ చరజీవులు
వాయునాళాలు వాయునాళ శ్వాసక్రియ (ట్రాకియల్) కీటకాలు

శ్వాసక్రియ రెండు దశల్లో జరుగుతుంది.
1. బాహ్య శ్వాసక్రియ: ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించడం, రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ బయటకు లేదా గాలి లేదా నీటిలోకి ప్రవేశించడం.
2. అంతర శ్వాసక్రియ: రక్తంలోని ఆక్సిజన్ కణాల్లోకి, కణాల్లోని కార్బన్ డై ఆక్సైడ్ రక్తంలోకి ప్రవేశించడం. ఉచ్వాసం (గాలి లోపలికి పీల్చుకోవడం), నిశ్వాసం (గాలి బయటకు వదలడం) క్రియలను కలిపి శ్వాసక్రియ అంటారు.
అమీబా: అమీబాలో విసరణ ద్వారా శ్వాస క్రియ జరుగుతుంది.
  1. విసరణ అంటే ఎక్కువ గాఢత కల్గిన ప్రదేశం నుంచి తక్కువ గాఢత గల ప్రదేశానికి పదార్థాల రవాణా.
  2. చర్మ శ్వాసక్రియ: కొన్ని జంతువుల్లో చర్మం ఒకటే శ్వాసేంద్రియం.
    ఉదా॥వానపాము, జలగ.
  3. కొన్నింటిలో అదనపు లేదా ద్వితీయ లేదా అనుబంధ శ్వాసేంద్రియాలు ఉంటాయి. ఉదా॥కప్ప.
  4. చర్మం ద్వారా శ్వాసక్రియ జరగాలంటే అది తడిగా ఉండాలి. అనేక రక్తనాళాలు కలిగి ఉండాలి.
    వానపాము:
    వానపాముల్లో హెమోగ్లోబిన్ రక్తంలోని ప్లాస్మా ద్రవంలో ఉంటుంది.
వానపాము తన శరీరాన్ని 3 విధాలుగా తడిగా ఉంచుతుంది.
  1. శరీరకుహరం (సీలోమ్) శరీర కుహర ద్రవంలో నిండి ఉంటుంది. ఇది పుృష్ట రంధ్రాల ద్వారా బయటకు వచ్చి చర్మాన్ని తడిగా చేస్తుంది.
  2. చర్మంలోని శ్లేష్మ కణాలు శ్లేష్మాన్ని స్రవి స్తాయి. ఈ శ్లేష్మం బయటకు వచ్చి చర్మా న్ని జిగురుగా ఉంచుతుంది.
  3. వానపాము బొరియల్లో జీవిస్తుంది. బొరి యల్లోని వాతావరణం బయట కంటే చల్లగా ఉండటం వల్ల చర్మం ఎండిపో కుండా తడిగా ఉంటుంది.
కప్పలో శ్వాసక్రియ
  • కప్ప ఉభయచర జీవి. నీటిలో, నేలమీద జీవిస్తున్నప్పుడు కప్ప చర్మం ఒక ముఖ్య మైన శ్వాసేంద్రియంగా పనిచేస్తుంది.
  • కప్ప తీసుకునే ఆక్సిజన్ మొత్తం పరిమా ణంలో మూడో వంతు చర్మం ద్వారా తీసు కుంటుంది.
  • కప్ప చర్మంలో ఉండే శ్లేష్మగ్రంథులు స్రవిం చే శ్లేష్మం వల్ల కప్ప చర్మం ఎప్పుడూ తడిగా ఉండి నీరు ఆవిరి రూపంలో బయటకు పోకుండా చూస్తుంది.
  • వేసవి కాలంలో కప్పలు నేలలో లోతుగా బొరియలు చేసి అందులో నివసిస్తాయి. దీ న్ని గ్రీష్మకాల సుప్తావస్థ లేదా వేసవి నిద్ర అంటారు.
  • అతి చల్లగా ఉండే శీతాకాలంలో కూడా కప్పలు బొరియల్లో నివసిస్తాయి. దాన్ని శీతాకాల సుప్తావస్థ లేదా శీతాకాల నిద్ర అంటారు. ఆయా కాలాల్లో కప్ప చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. సాలమండర్‌లు కూడా చర్మం ద్వారానే శ్వాసక్రియ జరుపుకుంటాయి.
వాయునాళ శ్వాసక్రియ
కీటకాల్లో చర్మ శ్వాసక్రియ ఉండదు. ఎందుకంటే వీటిలో శరీరం బయట బాహ్య అస్థిపంజరం ఉంటుంది. రక్తం అతి మెల్లగా ప్రవహించడం వల్ల, రక్తంలో హెమోగ్లోబిన్ లేకపోవడం వల్ల శ్వాసక్రియలో రక్తం పాత్ర ఉండదు. కీటకాల్లో శ్వాసక్రియకు వాయునాళ వ్యవస్థ ఉంటుంది. బొద్దింకలో శరీర పార్శ్వ భాగంలో పది జతల శ్వాసరంధ్రాలు ఉంటా యి. వీటికి కవాటాలు ఉంటాయి. ప్రతి శ్వాస రంధ్రం ఏట్రియం అనే కుహరంలో తెరుచుకుం టుంది. ఏట్రియం నుంచి ఒక నాళం బయలు దేరుతుంది. ఒకవైపు నాళాలన్నీ కలిసి ఒక ఆయత వాయు కాండంగా ఏర్పడతాయి.
వాయు నాళాలు వాయు నాళికలుగా విభజన చెంది శరీరమంతా వ్యాపిస్తాయి. వాయునాళాల ద్వారా గాలి లేదా ఆక్సిజన్ కణజాలాల వరకు ప్రత్యక్షంగా వెళుతుంది. అలాగే కార్బన్ డై ఆక్సైడ్ కణజాలాల నుంచి ప్రత్యక్షంగా నాళాల ద్వారానే బయటకు పోతుంది. ఈ శ్వాసక్రియలో శరీర కుడ్య కదలి కలు తోడ్పడతాయి.

ప్రాక్టీస్ బిట్స్
1. వాయునాళ శ్వాసక్రియకు ఉదాహరణ?
1) జలగ
2) కప్ప
3) బొద్దింక
4) చేప
2. అమీబా వంటి ఏకకణ జీవుల్లో శ్వాసక్రియ ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది?
1) ద్రవాభిసరణం
2) విసరణ
3) వాయునాళ పద్ధతి
4) కేంద్రకం
3. వానపాము శ్వాసక్రియకు ఉపయోగపడే అవయవం?
1) మొప్పలు
2) నెఫ్రీడియా
3) చర్మం
4) వాయునాళాలు
4. సాలమండర్ అనే ఉభయచర జీవిలో శ్వాసావయవం?
1) మొప్పలు
2) ఊపిరితిత్తులు
3) వాయునాళాలు
4) చర్మం
5. బొద్దింక శ్వాసక్రియలో రక్తం పాల్గొనదు ఎందుకు?
1) రక్తం అతివేగంగా ప్రవహిస్తుంది
2) రక్తంలో హెమోగ్లోబిన్ ఉండదు
3) ఈ జీవిలో రక్తం ఉండదు
4) ఈ జీవులకు హృదయం ఉండదు
6. బొద్దింకలో ఉండే శ్వాసరంధ్రాల సంఖ్య?
1) 10 జతలు
2) 5 జతలు
3) 12 జతలు
4) 16 జతలు
7. వానపాము చర్మం తడిగా ఉండటానికి సంబంధించి సరికానిది?
1) శరీర కుహర ద్రవం పుృష్టరంధ్రాల ద్వారా బయటకు రావడం వల్ల
2) చర్మంలోని శ్లేష్మకణాలు శ్లేష్మాన్ని స్రవించడం వల్ల
3) వానపాములో శీతల రక్తం ఉండటం వల్ల
4) వానపాము బొరియల్లో ఉండటం వల్ల
8. కిందివాటిలో ఏ జీవి అనుబంధ శ్వాసేం ద్రియం కలిగి ఉంది?
1) వానపాము
2) బొద్దింక
3) జలగ
4) కప్ప
9. కప్ప టాడ్‌పోల్ లార్వా శ్వాసేంద్రియం?
1) చర్మం
2) వాయు నాళికలు
3) మొప్పలు
4)ఊపిరితిత్తులు
10. బొద్దింకలోని ఆక్సిజన్ కణజాలాలకు చేరే పద్ధతికి సంబంధించి సరైంది?
1) ఆక్సిజన్ రక్తంలోని ఎర్ర రక్త కణాల ద్వారా కణజాలాలను చేరుతుంది.
2) ఆక్సిజన్ వాయు నాళికల ద్వారా నేరుగా కణజాలాలను చేరుతుంది.
3) ఆక్సిజన్ ఏట్రియం ద్వారా నేరుగా కణజాలాలకు చేరుతుంది
4) ఆక్సిజన్ నీటిలో కరిగి చర్మం ద్వారా కణజాలాలకు చేరుతుంది.
11. కిందివాటిలో జంతువులు వాటి శ్వాసేంద్రి యాలకు సంబంధించి సరికాని జతలు?
ఎ. సాలమండర్ - చర్మం
బి. బొద్దింక - వాయునాళాల ద్వారా
సి. ప్రౌఢ కప్ప - మొప్పలు
డి. అమీబా - ద్రవాభిసరణ

1) ఎ, డి 2) బి, సి 3) సి, డి 4) బి, డి
12. కప్ప గ్రీష్మకాల సుప్తావస్థను ఏ విధంగా పిలుస్తారు?
1) హైబర్‌నేషన్
2) ఏస్టివేషన్
3) మెటమార్ఫాసిస్
4) మోల్టింగ్
13. బొద్దింక శ్వాస వ్యవస్థలోకి గాలి ప్రవేశించే క్రమం?
1) వాయు నాళికలు, వాయు నాళ కాండం, శ్వాసరంధ్రాలు, ఏట్రియం, వాయునాళం
2) వాయునాళం,ఏట్రియం, శ్వాసరంధ్రాలు, వాయునాళికలు, వాయునాళ కాండం
3) శ్వాస రంధ్రాలు, వాయు నాళం, ఏట్రియం, వాయునాళ కాండం, వాయు నాళికలు
4) శ్వాస రంధ్రాలు, ఏట్రియం, వాయు నాళ కాండం, వాయు నాళాలు, వాయు నాళికలు
సమాధానాలు

1) 3

2) 2

3) 3

4) 4

5) 2

6) 1

7) 3

8)4

9) 3

10) 2

11) 3

12) 2

13) 4


గత డీఎస్సీల్లో ఇచ్చిన ప్రశ్నలు
1. మన శ్వాసక్రియలో బయటి గాలి ఊపిరి తిత్తుల్లోని వాయుగోణుల్లోకి చేరే మార్గం వరుస క్రమంలో (DSC2008)
1) నాశికారంధ్రాలు, నాశికా కుహరం, అంతర నాశికా రంధ్రాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాస నాళం, శ్వాసనాళిక
2) నాశికా కుహరం, నాశికా రంధ్రాలు, అంతర నాశికా రంధ్రాలు, స్వర పేటిక, గ్రసని, వాయునాళం, శ్వాస నాళిక, శ్వాసనాళం
3) నాశికా కుహరం, నాశికా రంధ్రాలు, అంతర నాశికా రంధ్రాలు, స్వర పేటిక, గ్రసని, వాయునాళం, శ్వాస నాళం, శ్వాసనాళిక
4) నాశికా రంధ్రాలు, నాశికా కుహరం, అంతర నాశికా రంధ్రాలు, గ్రసని, స్వరపేటిక, శ్వాస నాళిక, శ్వాసనాళం.
2. జంతువు శరీర పరిమాణం, భౌమ్య ఆవాస రకం, ఆవాసంలో లభించే నీరు, ఆ జంతువులో ఉన్న రక్తప్రసరణ వ్యవస్థలపై ఆధారపడే వ్యవస్థ? (DSC2006)
1) శ్వాసవ్యవస్థ
2) నాడీ వ్యవస్థ
3) జీర్ణ వ్యవస్థ
4) ప్రత్యుత్పత్తి వ్యవస్థ
3. ఉచ్వాస దశలో బొద్దింక వాయు నాళాలలో వాయు పీడనం బయటి వాయు పీడనం కంటే (DSC2006)
1) ఎక్కువ అవుతుంది
2) క్రమంగా పెరుగుతుంది
3) క్రమంగా పెరిగి తగ్గుతుంది.
4) తక్కువ అవుతుంది.
4. కప్ప టాడ్‌పోల్ లార్వాలో జరిగే శ్వాసక్రియ (DSC2004)
1) జల శ్వాసక్రియ
2) చర్మ శ్వాసక్రియ
3) వాయునాళ శ్వాసక్రియ
4) పుపుస శ్వాసక్రియ
5. శ్వాసక్రియ దహనంలో విభేదించే విషయం (DSC2012)
1) ఆక్సీకరణం జరుగుతుంది
2) శక్తిలో కొంతభాగం రసాయనిక శక్తిగా, మిగిలింది ఉష్ణంగా విడుదల అవుతుంది
3) O2 అవసరం
4) CO2, H2O ఏర్పడతాయి

సమాధానాలు
1) 1 2) 1 3) 4 4) 1 5) 2
Published date : 08 Dec 2014 07:58PM

Photo Stories