Skip to main content

రసాయన శాస్త్రం.. అనువర్తనాలు

జనరల్ అవేర్‌నెస్‌లో జనరల్ సైన్‌‌స పాత్ర కీలకం. అందులో అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యంఉంటుంది. ముఖ్యంగా రసాయన శాస్త్రానికి సంబంధించి పరిభాష, వివిధ పదార్థాల సంఘటనం, అనువర్తనాలు, శాస్త్రవేత్తలు-వారి ఆవిష్కరణలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటిని పట్టికల రూపంలో చదువుకుంటే తేలిగ్గా, ఎక్కువకాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. అటువంటి కొన్ని అంశాల ప్రత్యేకం...

మూలకాల సంకేతాలు
చాలావరకు మూలకాలను వాటి ఆంగ్ల నామంలోని మొదటి అక్షరంతో సూచిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మూలకాల మొదటి అక్షరాలు ఒకేవిధంగా ఉంటే.. మూలకంలోని రెండో అక్షరాన్ని లేదా ప్రస్ఫుటమైన అక్షరాన్ని మొదటి అక్షరానికి కలిపి సంకేతంగా సూచిస్తారు. వీటిని గుర్తించటం తేలిక. ఉదా: హైడ్రోజన్ (H), కాల్షియం (Ca), కాడ్మియం (Cd). అయితే కొన్ని మూలకాల సంకేతాలను వాటి లాటిన్ పేర్ల నుంచి తీసుకున్నారు. వాటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

మూలకం

లాటిన్ పేరు

సంకేతం

సోడియం

నేట్రియం (Natrium)

Na

పొటాషియం

కాలియం (Kalium)

K

ఇనుము (ఐరన్)

ఫై (Ferrum)

Fe

రాగి (కాపర్)

క్యుప్రం (Cuprum)

Cu

బంగారం(గోల్డ్)

ఆరమ్ (Aurum)

Au

పాదరసం (మెర్క్యురీ)

హైడ్రార్జిరం (Hydrargyrum)

Hg

సీసం (లెడ్)

ప్లంబం (Plumbum)

Pb

తగరం(టిన్)

స్టానమ్ (Stannum)

Sn

ఆంటిమొని

స్టిబియం (Stibium)

Sb

టంగ్‌స్టన్

వోల్‌ఫ్రం (Wolfram)

W


మూలకాలు - ప్రత్యేకత
ప్రత్యేకతలు కలిగిన మూలకాలు: ప్రతి మూలకానికి ఏదో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. అటువంటి వాటిలో కొన్ని..
మూలకం - ప్రత్యేకత
  • హైడ్రోజన్ - అత్యంత తేలికైన వాయువు; న్యూట్రాన్లు లేని ఏకైక మూలకం; సాధారణ ఆమ్లాల్లో తప్పనిసరిగా ఉండే మూలకం
  • లిథియం - అత్యంత తేలికైన లోహం
  • పాదరసం - గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే లోహం
  • బ్రోమిన్ - గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే అలోహం
  • సిల్వర్ - అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం
  • ఆక్సిజన్ - భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం (అలోహం)
  • అల్యూమినియం - భూపటలంలో అత్యధికంగా ఉండే లోహం
  • సిలికా - శిలలు, ఇసుకలో అత్యధికంగా ఉండే మూలకం
  • నైట్రోజన్ - గాలిలో అత్యధిక శాతం గల మూలకం
  • కాల్షియం - మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం
  • సీసియం - అత్యధిక లోహ స్వభావం గలది
  • ఫ్లోరిన్ - అత్యధిక రుణవిద్యుదాత్మకత గలది
  • క్లోరిన్ - అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గలది
  • హీలియం - అత్యధిక అయనీకరణ శక్మం; అత్యల్ప చర్యాశీలత; అత్యంత జడత్వం గల మంద వాయువు; ద్రవ రూపంలో పాత్రలపైకి ఎగబాకుతుంది (సూపర్ ఫ్లూయిడ్)
  • రాగి - మానవుడు ఉపయోగించిన మొదటి లోహం
  • బంగారం - రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉన్న లోహం
  • గాలియం - వేసవి ద్రవంగా పిలిచే లోహం (చేతి ఉష్ణోగ్రతకు కరుగుతుంది)
  • టైటానియం - ఉక్కులో సగం బరువు, సమాన గట్టిదనం గల లోహం
  • గ్రాఫైట్ రూపం - అలోహమైనప్పటికీ విద్యుత్‌లోని కార్బన్ వాహకత కలిగిన మూలకం

మూలకాలు - అనువర్తనాలు
నిత్యజీవితంలో అనేక మూలకాలు వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. శరీరంలో జరిగే వివిధ ప్రక్రియలలో, పరిశ్రమలలో, పరికరాలలో ప్రత్యేక పాత్రను పోషిస్తాయి.
  • ఇనుము - ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్‌లో ఉంటుంది. ఇది లోపిస్తే రక్తహీనత కలుగుతుంది. హేబరు పద్ధతిలో ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది.
  • నికెల్ - నూనెల హైడ్రోజనీకరణంలో ఉత్ప్రేరకం
  • కోబాల్ట్ - విటమిన్ బి12లో ఉండే లోహం
  • మెగ్నీషియం - మొక్కల్లోని పత్రహరితంలో ఉంటుంది
  • మాంగనీస్ - స్త్రీ, పురుషుల్లో ప్రత్యుత్పత్తి హార్మోన్లకు అవసరమైంది.
  • కాల్షియం - ఎముకల నిర్మాణంలోని లోహం
  • ఫ్లోరిన్ - దంతక్షయాన్ని నివారిస్తుంది. ఇది ఎక్కువైతే ఫ్లోరోసిస్ వస్తుంది.
  • సిలికాన్ - సోలార్ ప్యానల్‌లు, కంప్యూటర్ల ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ల తయారీలో
  • క్లోరిన్ - నీటిని క్రిమిరహితం చేసేందుకు
  • గ్రాఫైట్ - యంత్రాలలో కందెనగా, డ్రెసైల్‌లో, అణువిద్యుత్ కేంద్రాల్లో మితకారిగా
  • పొటాషియం - శరీరంలో నీటి సమతౌల్యత కాపాడటంలో, రక్తపోటు నియంత్రణలో
  • సోడియం - రక్తపోటును పెంచుతుంది. నీటి సమతౌల్యత కాపాడటంలో
  • ద్రవ సోడియం - అణు రియాక్టర్లలో శీతలీకరణి
  • టంగ్‌స్టన్ - విద్యుత్ బల్బులలో ఫిలమెంట్‌గా
  • సల్ఫర్ - రబ్బరు వల్కనీకరణ ప్రక్రియలో
  • కాల్షియం, మెగ్నీషియం - కఠిన జలంలో ఉండే అయాన్‌లు
  • అయొడిన్ - థైరాయిడ్, గాయిటర్ నియంత్రణలో
  • మెర్క్యురీ - థర్మామీటర్, భారమితిలలో
  • జింక్ - గాల్వనైజేషన్ ప్రక్రియలో
  • కోబాల్ట్-60 - ఇది రేడియోధార్మికత గల ఐసోటోప్. ఇది విడుదల చేసే గామా కిరణాలతో కేన్సర్‌కు చికిత్స చేస్తారు.
  • యురేనియం-238 - అణు ఇంధనం
  • సీసం (లెడ్) - రేడియోధార్మికతకు రక్షణ కవచం; వాయుకాలుష్యంలో ముఖ్యలోహం.

రసాయనాలు-సాధారణ నామాలు
అనేక రసాయనిక పదార్థాలను సాధారణ పేర్లతో పిలుస్తారు. వాటిలో కొన్ని..
  • తినే సోడా, వంట సోడా, బేకింగ్ సోడా - సోడియం బైకార్బొనేట్
  • వాషింగ్ సోడా - సోడియం కార్బొనేట్
  • కాస్టిక్ సోడా - సోడియం హైడ్రాక్సైడ్
  • వాటర్ గ్లాస్ - సోడియం సిలికేట్
  • లాఫింగ్ గ్యాస్ - నైట్రస్ ఆక్సైడ్
  • స్మెల్లింగ్ సాల్ట్ - అమ్మోనియం క్లోరైడ్
  • సున్నపు రాయి - కాల్షియం కార్బొనేట్
  • టేబుల్ సాల్ట్ - సోడియం క్లోరైడ్
  • వెనిగర్ - ఎసిటికామ్లం
  • మార్‌‌ష వాయువు - మీథేన్
  • మిల్క్ ఆఫ్ లైమ్, తడి సున్నం - కాల్షియం హైడ్రాక్సైడ్
  • మిల్క్ ఆఫ్ మెగ్నీషియా - మెగ్నీషియం హైడ్రాక్సైడ్
  • ప్లాస్టర్ ఆఫ్ పారిస్ - కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్
  • హైపో - సోడియం థయోసల్ఫేట్
  • ద్రవరాజం (ఆక్వారీజియం) - గాఢ హైడ్రోక్లోరికామ్లం + గాఢ నత్రికామ్లం (3:1)
  • గన్ కాటన్ - సెల్యులోజ్ నైట్రేట్

రసాయనాలు - ఉపయోగాలు
రసాయన పదార్థాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని..
  • కార్బన్‌డైఆక్సైడ్ - మంటలను ఆర్పటానికి
  • టెఫ్లాన్ - నాన్‌స్టిక్ వంటపాత్రలు
  • అల్యూమినియం సిలికేట్ (మైకా) - ఇస్త్రీపెట్టెల వంటి విద్యుత్ సాధనాలలో విద్యుత్ నిరోధకంగా
  • సల్ఫ్యూరికామ్లం - బ్యాటరీలలో
  • ఎర్ర భాస్వరం - అగ్గిపుల్లల తయారీలో
  • హైపో - ఫొటోగ్రఫీలో
  • జింక్ ఫాస్ఫైడ్ - ఎలుకల మందు
  • బొరాక్స్ - యాంటీ సెప్టిక్
  • కాల్షియం ఫాస్ఫేట్ - పంటి ఎనామిల్‌లో ఉంటుంది.
  • ఫాస్ఫారికామ్లం - శీతలపానీయాలలో వాడతారు
  • ఐరన్ ఆక్సైడ్ - టేప్ రికార్డర్ టేపు పైపూతలో, రంగుటద్దాలు, గాగుల్స్‌లో
  • బేకింగ్ సోడా, మిల్క్ ఆఫ్ లైమ్ - ఆమ్ల విరోధి (యాంటాసిడ్)
  • పొటాష్ ఆలం - నీటి శుద్ధికి, గాయం అయినపుడు రక్తస్రావం ఆపటంలో
  • సిల్వర్ అయొడైడ్ - కృత్రిమ వర్షం కురిపించటానికి (మేఘ బీజనానికి)
  • ఓజోన్ - నీటి శుద్ధి, స్ట్రాటోవరణంలో ్ఖగ కిరణాల వడపోత
  • కార్బోనికామ్లం - సోడానీటిలో, శీతలపానీయాల్లో
  • సెలినియం సల్ఫైడ్ - చుండ్రు నివారించే షాంపూల తయారీలో
  • బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ - నీటిని క్రిమిరహితం చేయటానికి
  • బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్ - ్రైడె క్లీనింగ్
  • పొటాషియం పర్మాంగనేట్ - యాంటీసెప్టిక్
  • సోడియం బెంజోయేట్ - ఆహార నిల్వకారిణి
  • ట్రైక్లోరోకార్బానిలైడ్ (టీసీసీ) - మెడికేటెడ్ సబ్బులలో, క్రిమి సంహారిణిగా
  • హైడ్రోజన్ పెరాక్సైడ్ - తైలవర్ణ చిత్రాల రంగులను పునరుద్ధరించటానికి, పెర్‌హైడ్రాల్ రూపంలో యాంటిసెప్టిక్‌గా ఉపయోగిస్తారు.

శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు
రసాయన శాస్త్రగతిని మార్చిన ఆవిష్కరణలు ఎన్నో జరిగాయి. అందులో మానవాళికి ఉపయోగకరమైనవి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని..
  • జాన్ డాల్టన్ - పరమాణు సిద్ధాంతం
  • రూథర్‌ఫర్‌‌డ - పరమాణు కేంద్రకం, ఆల్ఫా, బీటా కిరణాలు
  • జె.జె.థామ్సన్- ఎలక్ట్రాన్
  • గోల్డ్‌స్టీన్ - ప్రోటాన్
  • జేమ్స్ చాడ్విక్ - న్యూట్రాన్
  • హెన్రీ బెక్వరల్ - సహజ రేడియోధార్మికత
  • మేరీ క్యూరీ - కృత్రిమ రేడియోధార్మికత
  • రాంట్‌జన్ - X - కిరణాలు
  • జోహాన్ రిట్టర్ - అతినీలలోహిత (UV) కిరణాలు
  • విలియం హర్‌షెల్ - పరారుణ కిరణాలు
  • విల్లార్ - గామా కిరణాలు
  • ఐన్‌స్టీన్ - ద్రవ్య-శక్తి నిత్యత్వ నియమం, కాంతి విద్యుత్ ఫలితం
  • ఆల్‌ఫ్రెడ్ నోబెల్ - డైనమైట్
  • మాక్స్ ప్లాంక్ - క్వాంటం సిద్ధాంతం
  • ఫారడే - విద్యుద్విశ్లేషణ

రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు..
శాస్త్రవేత్త - కనుగొన్న అంశం
  • మేరీ క్యూరీ - కృత్రిమ రేడియోధార్మికత
  • మాక్స్ ప్లాంక్ - క్వాంటం సిద్ధాంతం
  • ఐన్‌స్టీన్ - కాంతి విద్యుత్ ఫలితం
  • నీల్స్ బోర్ - పరమాణు నిర్మాణం
  • వెంకటరామన్ రామకృష్ణన్ - రైబోజోమ్ నిర్మాణం

మాదిరి ప్రశ్నలు
  1. పరారుణ కిరణాల ఆచూకీ తెలిపిన మొదటి శాస్త్రవేత్త?
    1) బెకరల్
    2) బెల్
    3) హర్‌షెల్
    4) మాక్స్‌వెల్
  2. ఐన్‌స్టీన్‌కు ఏ ఆవిష్కరణకు నోబెల్ బహుమతి లభించింది?
    1) గామా కిరణాలు
    2) అతినీలలోహిత కిరణాలు
    3) కాంతి-విద్యుత్ ఫలితం
    4) కాంతి ద్వంద్వ స్వభావం
  3. ఆమ్లతకు విరుగుడు (యాంటాసిడ్)గా వాడే మిల్క్ ఆఫ్ మెగ్నేషియా ఏది?
    1) మెగ్నీషియం అసిటేట్
    2) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
    3) మెగ్నీషియం క్లోరైడ్
    4) మెగ్నీషియం నైట్రేట్
  4. కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల తయారీలో ఉపయోగించే మూలకం?
    1) ఐరన్
    2) మెగ్నీషియం
    3) అల్యూమినియం
    4) సిలికాన్
  5. విటమిన్ ఆ12లో గల లోహ అయాన్ ఏది?
    1) కోబాల్ట్
    2) జింక్
    3) మెగ్నీషియం
    4) ఐరన్
సమాధానాలు:
1) 3 2) 3 3) 2 4) 4 5) 1
Published date : 08 Jan 2016 01:57PM

Photo Stories