Skip to main content

RRBలో దరఖాస్తు విధానమే కీలకం

ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత కోసం నూతన సంవత్సర కానుకనందించింది ఆర్‌ఆర్‌బీ. ఈ మేరకు దేశవ్యాప్తంగా 18252 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మంచి జీతభత్యాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత ఉండే ఒక పోస్టు సొంతం చేసుకోవాలంటే నిరంతరం శ్రమించాల్సిందే.
 
మరి శ్రమ ఒక్కటే సరిపోతుందా?
అంటే కచ్చితంగా కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రమతో పాటు సరైన సమాచారంతో దరఖాస్తు చేయడం, ఆన్‌లైన్‌లోపరీక్ష రాయడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. దరఖాస్తు ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా.. మార్పులు చేర్పులు చేసుకోవాలంటే అదనంగా (Additional) ఎవరైనా రూ.100 రుసుం చెల్లించాలి. ముఖ్యంగా అభ్యర్థి పరీక్షలో అనర్హుడిగా (Rejected) తేలే అవకాశం ఉంది.కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మొదటి, కీలక దశ అయినా దరఖాస్తు దశను విజయవంతంగా పూర్తి చేయాలంటే ఈ వ్యాసం చదవాల్సిందే.

సిద్ధంగా ఉంచుకోవాల్సినవి
 • ఆన్‌లైన్ దరఖాస్తును ప్రారంభించే ముందు పూర్తి సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. వివరాలన్ని చెంతనే ఉంటే దరఖాస్తు సులువుగా చేయవచ్చు.
 • అన్ని పోస్టులకు కలిపి ఒకే ఆన్‌లైన్ అప్లికేషన్ కాబట్టి దరఖాస్తు చేసే బోర్డులోని పోస్టుల వివవరాలపై కొంత అవగాహన ఉండాలి. పోస్టుల ప్రాధాన్య క్రమం (Posts Preferences) ఎంచుకోవాలంటే ఇది తప్పనిసరి.
 • అభ్యర్థులు పేరు, పుట్టిన తేది, తండ్రి పేరు, తల్లి పేరు, పదో తర గతి రోల్ నంబర్, చదివిన రాష్ట్రం, బోర్డు, ఉత్తీర్ణులైన సంవత్సరం, కుల ధ్రువీకరణ పత్రం నంబర్, జారీ తేది, జారీ చేసిన అథారిటీ,(ఎస్సీ/ఎస్టీలకు మాత్రమే) ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ వ ంటి వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
 • ఎక్స్ సర్వీస్‌మెన్ అయితే ఉద్యోగంలో చేరిన తేది, సర్వీస్ పూర్తయిన తేది సిద్ధంగా ఉంచుకోవాలి.
 • డిగ్రీకి సంబంధించి చదివిన కళాశాల, సంవత్సరం, పర్సేంటేజ్ వంటివి.
 • ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేవారైతే ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు.
 • చివరి దశలో ఫోటో అప్‌లోడ్ చేయాలి. కాబట్టి అభ్యర్థులు 3.5 సెం.మీ × 3.5 సెం.మీ, 15 నుంచి 40 kb గల JPEG ఫోటో, స్కాన్ చేసిన కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీలు మాత్రమే) సిద్ధంగా ఉంచుకోవాలి.

ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం 4 దశల్లో లేదా 3 దశల్లో (ఫీజు లేనివారికి) ఉంటుంది. కాబట్టి ప్రతి దశలోనూ సరైన సమాచారాన్ని నింపి (Enter) సబ్‌మిట్ (Submit) చేయాలి. ముఖ్యంగా ఫీజు మాఫీ లేని జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు.

నాలుగు దశలు: ప్రాథమిక దశ (Primary Stage), ద్వితీయ దశ (Secondary Stage), పేమెంట్ దశ (Payment Stage), చివరి దశ (Final Stage).
 • ప్రాథమికదశలోకి వెళ్లడానికి ముందు https://rrbsecunderabad.nic.in/ ఓపెన్ చేసి, కుడివైపున కన్పించే Apply online for NTPC Graduate categories of C.E.N.No.03/2015 అనే లింక్ క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే పేజీలో నోటిఫికేషన్, ఖాళీల వివరాలు, సూచనలు, ముఖ్యమైన తేదీలు వంటి వివరాలు కనిపిస్తాయి.

 • నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత New Registration లింక్‌ను క్లిక్ చేయాలి. కింది విధంగా రైల్వే బోర్డుల జాబితా కన్పిస్తుంది.

  RRB

 • తర్వాత మీరు దరఖాస్తు చేసే రైల్వేబోర్డ్ (RRB)ను ఎంపిక చేసుకొని Apply Now ను క్లిక్ చేయాలి.

  గమనిక: మీ రైల్వేబోర్డ్‌లో ఉన్న పోస్టుల వివరాలు తెలుసుకోవాలంటే దాని పక్కనే ఉన్న Details ను క్లిక్ చేయొచ్చు.

  RRB


  తర్వాత డిక్లరేషన్ పేజీలో ఉన్న షరతులను అంగీకరించడానికి Accept బటన్ క్లిక్ చేయండి.

ప్రాథమిక దశ (Primary Stage)
ఈ దశలోని దరఖాస్తు పేజీలో పేరు, పుట్టిన తేది, పదో తరగతి హాల్‌టికెట్ నంబర్, చదివిన రాష్ట్రం, చదివిన బోర్డు, ఉత్తీర్ణులైన సంవత్సరం, కుల ధ్రువీకరణ పత్రం (నంబర్, జారీ చేసిన తేది - ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు), ఆధార్ కార్డ్ నంబర్, పనిచేసే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటివి నింపాలి. ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ వివరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులు వారి వివరాలు, సహాయకుడు (Scribe) కావాల్సిన వారు సంబంధిత వివరాలను ఈ దశలోనే నింపాలి.

RRB

RRB

RRB


గమనిక: ప్రాథమిక దశలో దరఖాస్తులో Is your name printed in vernacular language as in 10th mark sheet? అని ఉంటుంది. ‘‘పదో తరగతి మార్కుల జాబితాలో మీ పేరు స్థానిక భాషలో ముద్రితమైందా అని దానర్థం’’. మార్కుల జాబితాలో పేరు ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. కాబట్టి No అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

వివరాలన్ని నింపిన తర్వాత Click to continue బటన్ క్లిక్ చేయగానే Primary Registration Declaration అని ఒక పేజీ వస్తుంది. అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకుని సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయండి. ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే మాత్రం Back to details అనే బటన్ క్లిక్ చేయండి.

RRB


వివరాలు సబ్‌మిట్ చేసిన తర్వాత మీ మొబైల్‌కు ఒక One Time Password (OTP) తో పాటు, ఈమెయిల్‌కు ఒక లింక్ వస్తాయి. వీటి ద్వారా మీ అప్లికేషన్‌ను యాక్టివేట్ చేయడంతో ద్వితీయ (Secondary Stage) దశ ప్రారంభమవుతుంది. యాక్టివేషన్ వెంటనే లేదా తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు.

RRB


యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే పేరు, పదోతరగతి రోల్ నంబర్, తండ్రి పేరు, OTP, అక్కడ కన్పించే ఆల్ఫా న్యూమరిక్ అక్షరాలు ఎంటర్ చేసి Submit చేయాలి. దీంతో దరఖాస్తు యాక్టివ్ అయి ప్రాథమిక దశ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి కింది విధంగా సమాచారం వస్తుంది.

RRB


ద్వితీయ దశ (Secondary Stage)
ద్వితీయ దశలోకి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదితో లాగిన్ అవ్వాలి.

RRB

RRB

RRB

ఇందులో కన్పించే దరఖాస్తులోమీ పోస్టుల ప్రాధాన్య క్రమం, పరీక్ష కేంద్రాల ఎంపిక, విద్యార్హత వివరాలు, చిరునామా నింపి Click to continue బటన్ క్లిక్ చేయడంతో
పేమెంట్ దశకు చేరుకుంటారు. ఫీజు మినహాయింపు కలిగిన వారికి ఈ దశ ఉండదు.

పేమెంట్ దశ (Payment Stage)
ఈ దశలో పేమెంట్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ఆఫ్‌లైన్‌లో అయితే చలాన్ ద్వారా పోస్ట్ ఆఫీస్‌లో చెల్లించవచ్చు.
RRB
RRB
ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత చివరి దశకు చేరకుంటారు.

చివరి దశ (Final Stage)
ఈ దశలో పాస్‌పోర్డు సైజ్ కలర్ఫొటో (3.5 సెం.మీ × 3.5 సెం.మీ, 15 kb నుంచి 40 kb of JPEG) అప్‌లోడ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

RRB

ఫోటో, సర్టిఫికెట్ అప్‌లోడ్ చేసిన తర్వాత నియమ నిబంధనలు అంగీకరించి ‘Complete my Registration’ బటన్ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తై తర్వాత దరఖాస్తు ప్రింట్ తీసుకోవాలి.

RRB


దరఖాస్తు విధానంలో ఎలాంటి సందేహాలున్నా education@sakshi.com కి మెయిల్ చేయండి
దరఖాస్తు ఎలా చేయాలి? క్లిక్ చేయండి.
తరచుగా వచ్చే సందేహాలు: క్లిక్ చేయండి.
ఫోటో, సర్టిఫికెట్ అప్‌లోడింగ్ సూచనలు: క్లిక్ చేయండి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి
.
దరఖాస్తు విధానం ఇంగ్లిష్‌లో చదవడానికి క్లిక్ చేయండి.
@sakshi.com>
Published date : 30 Dec 2015 04:41PM

Photo Stories