రైల్వేలో ఇంజనీర్ కొలువులు
Sakshi Education
భారతీయ రైల్వే... ప్రపంచంలోనే అత్యధిక రైల్వే నెట్‌వర్క్ కలిగిన సంస్థల్లో ఒకటి. ప్రతి రోజూ 2.3 కోట్ల ప్రజలను గమ్యస్థానాలకు చేర్చుతూ దేశంలోనే అత్యధిక మంది ఉద్యోగులకు ఉపాధినిస్తోంది.
తాజాగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో పలు విభాగాల్లో రెండు వేలకు పైగా టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలు, అర్హతలు, రాత పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్‌పై ఫోకస్...
భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే నియామక బోర్డుల నుంచి జూన్ 27న కేంద్రీకృత నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆకర్షణీయ వేతనాలతో సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు ఈ కొలువులు మంచి అవకాశాలు.
ఖాళీలు:
రైల్వేలోని వివిధ రైల్వే జోన్ల పరిధిలో కింది విభాగాల్లో సుమారు 2235 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో దక్షిణ మధ్య రైల్వే - సికింద్రాబాద్ పరిధిలో 741 (సీనియర్ సెక్షన్ ఇంజనీర్-302, జూనియర్ ఇంజనీర్-439) పోస్టులున్నాయి.
విభాగాలు: పీ-వే, బ్రిడ్జ్, వర్క్స్, డ్రాయింగ్ (సివిల్) అండ్ డి జైన్ అండ్ ఎస్టిమేషన్, రీసెర్చ్ ఇంజనీర్, టీఎంఎస్, మెకానికల్, వర్క్‌షాప్, క్యారేజ్ అండ్ వేగన్, డీజిల్ మెకానికల్, జిగ్ అండ్ టూల్, ఎలక్ట్రికల్ (జీఎస్, టీఆర్డీ, టీఆర్‌ఎస్), సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ మొదలైనవి.
అర్హత:
వయో పరిమితి:
ఎంపిక ప్రక్రియ:
ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. చివర్లో వైద్య పరీక్షను కూడా నిర్వహిస్తారు.
పరీక్ష స్వరూపం:
ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
ముఖ్య అంశాలు:
పరీక్ష ఫీజు:
అన్‌రిజర్వ్‌డ్/ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100. మిగిలిన వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించొచ్చు.
దరఖాస్తు విధానం:
ప్రిపరేషన్ ప్లాన్
90 మార్కుల విభాగం:
60 మార్కుల విభాగం:
సూచనలు
రిఫరెన్స్
భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే నియామక బోర్డుల నుంచి జూన్ 27న కేంద్రీకృత నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆకర్షణీయ వేతనాలతో సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు ఈ కొలువులు మంచి అవకాశాలు.
ఖాళీలు:
రైల్వేలోని వివిధ రైల్వే జోన్ల పరిధిలో కింది విభాగాల్లో సుమారు 2235 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో దక్షిణ మధ్య రైల్వే - సికింద్రాబాద్ పరిధిలో 741 (సీనియర్ సెక్షన్ ఇంజనీర్-302, జూనియర్ ఇంజనీర్-439) పోస్టులున్నాయి.
- సీనియర్ సెక్షన్ ఇంజనీర్: 1165
- జూనియర్ ఇంజనీర్/ రీసెర్చ్ ఇంజనీర్: 935
విభాగాలు: పీ-వే, బ్రిడ్జ్, వర్క్స్, డ్రాయింగ్ (సివిల్) అండ్ డి జైన్ అండ్ ఎస్టిమేషన్, రీసెర్చ్ ఇంజనీర్, టీఎంఎస్, మెకానికల్, వర్క్‌షాప్, క్యారేజ్ అండ్ వేగన్, డీజిల్ మెకానికల్, జిగ్ అండ్ టూల్, ఎలక్ట్రికల్ (జీఎస్, టీఆర్డీ, టీఆర్‌ఎస్), సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ మొదలైనవి.
- చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 25
- డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 35
- కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: 75
అర్హత:
- సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (ఎస్‌ఎస్‌ఈ) గ్రూపు ఉద్యోగాలకు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌స, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర బ్రాంచ్‌ల్లో బీఈ లేదా బీటెక్.
- జూనియర్ ఇంజనీర్ (జేఈ) గ్రూపు ఉద్యోగాలకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌స, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర బ్రాంచ్‌ల్లో డిప్లొమా ఉండాలి.
- కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి మెటలర్జీ/ కెమికల్ ఇంజనీర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎంఎస్సీ కెమి స్ట్రీ లేదా అప్లయిడ్ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారు అర్హులే.
- కొన్ని పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కాకుండా ఇతర కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. ఉదాహరణకు జూనియర్ ఇంజనీర్(ఐటీ) పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి పీజీడీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)/బీసీఏ/డీవోఈఏసీసీ-ఎ లెవెల్ సర్టిఫికెట్ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు.
- మొత్తం 52 కేటగిరీల పోస్టులున్నాయి. వీటిలో ఉద్యోగం స్వభావాన్ని బట్టి ప్రత్యేక బ్రాంచ్‌లో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా/ ఇతర అర్హతను నిర్దేశించారు. వీటిని పరిశీలించి అర్హత ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
వయో పరిమితి:
- ఎస్‌ఎస్‌ఈ ఉద్యోగాలకు 2015, జూలై 1 నాటికి 20-34 ఏళ్ల వయసుండాలి.
- జేఈ ఉద్యోగాలకు 2015, జూలై 1 నాటికి 18-32 ఏళ్ల వయసుండాలి.
- ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 15 ఏళ్లు, ఇతర పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఇతర పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. చివర్లో వైద్య పరీక్షను కూడా నిర్వహిస్తారు.
పరీక్ష స్వరూపం:
ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
విభాగం | ప్రశ్నలు |
1. టెక్నికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ | 90 |
2. జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ | 60 |
మొత్తం | 150 |
- రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
- ఇంగ్లిష్/హిందీ/ఉర్దూ లేదంటే స్థానిక భాషను మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.
ముఖ్య అంశాలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జూలై 26, 2015
- పరీక్ష తేది: ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5
పరీక్ష ఫీజు:
అన్‌రిజర్వ్‌డ్/ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100. మిగిలిన వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించొచ్చు.
దరఖాస్తు విధానం:
- ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్‌ఆర్‌బీకి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌ఎస్‌ఈ, జేఈలకు రెండింటికీ అర్హత ఉంటే విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
- తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
- వెబ్‌సైట్: rrbsecunderabad.nic.in
ప్రిపరేషన్ ప్లాన్
90 మార్కుల విభాగం:
- జనరల్ సైన్స్: సీనియర్ సెక్షన్ ఇంజనీర్(ఎస్‌ఎస్‌ఈ) ప్రశ్నపత్రంలో జనరల్ సైన్స్‌కు సంబంధించి ఇంటర్ స్థాయి ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, బయాలజీ ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకుంటే ప్రశ్నలకు తేలిగ్గానే సమాధానాలు గుర్తించొచ్చు. జేఈ పరీక్షకు పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి.
- టెక్నికల్ ఎబిలిటీ: ఎస్‌ఎస్‌ఈ ప్రశ్నపత్రంలో సివిల్; మెకానికల్; ఎలక్ట్రికల్; ఎలక్ట్రానిక్స్; కంప్యూటర్స్; ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్; ఇన్‌స్ట్రుమెంటేషన్, మెజర్‌మెంట్, ఇంజనీరింగ్ డ్రాయింగ్/గ్రాఫిక్స్‌పై ప్రశ్నలుంటాయి. జేఈకి కూడా ఇవే అంశాలపై ప్రశ్నలుంటాయి. కానీ ప్రశ్నల కఠినతా స్థాయి తక్కువగా ఉంటుంది.
- ఉద్యోగ సాధనకు మంచి స్కోర్ సాధించాలంటే ఏదైనా ఒక బ్రాంచ్‌కు చెందిన విద్యార్థి మరికొన్ని ఇతర బ్రాంచ్‌లకు సంబంధించిన అంశాలపైనా పట్టుసాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మెకానికల్ గ్రాడ్యుయేట్‌కు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు కష్టం గా ఉంటాయి. అందువల్ల ఓ ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను అనుసరించి వివిధ సబ్జెక్టుల్లోని ముఖ్యమైన భావనలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి.
- ఎలక్ట్రికల్‌లో ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, బేసిక్ సర్క్యూట్ల అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి.
- ఎలక్ట్రానిక్స్‌లో ఎలక్ట్రానిక్ డివెసైస్, సర్క్యూట్లు, కమ్యూనికేషన్ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
- కంప్యూటర్స్‌కు సంబంధించి సి, జావా, డీబీఎంఎస్ తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- సివిల్‌లో స్ట్రెన్త్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, సర్వేయింగ్ అంశాలు ముఖ్యమైనవి.
- మెకానికల్‌లో థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, హీట్ ఇంజన్స్ అంశాలు ప్రధానమైనవి.
- ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ట్రాన్స్‌డ్యూసర్స్, కంట్రోల్ సిస్టమ్స్ అంశాలు ముఖ్యమైనవి.
60 మార్కుల విభాగం:
- అర్థమెటిక్: న్యూమరికల్ ఎబిలిటీ, కాలం, దూరం, వేగం, సరాసరి, నిష్పత్తి, శాతాలు, వడ్డీ గణన తదితర అంశాలపై దృష్టిసారించాలి.
- జనరల్ అవేర్‌నెస్: అవార్డులు-విజేతలు, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, కరెంట్ ఈవెంట్స్, జాగ్రఫీ, ఎకానమీ, క్రీడలు మొదలైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- జనరల్ ఇంటెలిజెన్స్: ఈ విభాగంలో అభ్యర్థి తార్కిక, వివేచనాత్మక శక్తిని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు సిరీస్, అనాలజీ, ర్యాంకింగ్స్ తదితర అంశాలున్న సమస్యల్ని ప్రాక్టీస్ చేయాలి.
- రీజనింగ్ ఎబిలిటీ: పజిల్స్, కాస్ట్ అండ్ ఎఫెక్ట్, బ్లడ్ రిలేషన్స్, మేకింగ్ జడ్జ్‌మెంట్స్, అనలైజింగ్ ఆర్గ్యుమెంట్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ విభాగాలకు ఆర్‌ఎస్ అగర్వాల్ పుస్తకాలు ఉపయోగపడతాయి.
సూచనలు
- సిలబస్‌పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి. తర్వాత ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించుకోవాలి.
- చదివిన అంశానికి సంబంధించిన ప్రశ్నలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి.
- బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లలో అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
- ప్రిపరేషన్‌లో కొంత సమయాన్ని గ్రూప్‌గా చదవడానికి కేటాయించాలి. దీనివల్ల తెలియని అంశాలపై పట్టు సాధించేందుకు అవకాశముంటుంది.
- గత ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రశ్నల స్థాయిని అర్థం చేసుకొని దానికనుగుణంగా ప్రిపరేషన్‌ను మలచుకోవాలి.
- ఇంజనీరింగ్ బ్రాంచ్ సబ్జెక్టుల్లోని ప్రాథమిక సూత్రాలను ఒకచోట రాసుకొని, వాటిని పునశ్చరణ చేస్తుండాలి.
- సమయ పాలన అలవడటం కోసం నమూనా ప్రశ్నపత్రాలను సాధిస్తుండాలి.
- అన్ని బ్రాంచ్‌ల్లో కంటే మెకానికల్ బ్రాంచి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
- రోజులో టెక్నికల్ సబ్జెక్టుకు కనీసం 4 గంటలు, ఇతర విభాగాలకు 3 గంటలు కేటాయించాలి.
రిఫరెన్స్
- మెకానికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ - ఆర్‌కే జైన్
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్- వి.కె.మెహతా
- సివిల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ - రంగాచారి
- ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ - రాజ్‌పుట్
- కంప్యూటర్ సైన్స్ ఆబ్జెక్టివ్ - థిమోతీ
Published date : 03 Jul 2015 12:11PM