UGC NET 2022 Results Out: యూజీసీ నెట్ 2022 ఫలితాలు వచ్చేశాయ్
ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. సీబీటీ విధానంలో మొత్తం 83 సబ్జెక్టుల్లో పరీక్ష జరిగింది. యూజీసీ ఆధ్వర్యంలో ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.
చదవండి: ఆకాశమంత అంబేడ్కరుడు.. విగ్రహం విశేషాలు ఇవే
8.34 లక్షల మంది హాజరు
దేశవ్యాప్తంగా 186 నగరాల్లో ఐదు దశల్లో జరిగిన ఈ పరీక్షకు 8.34 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఏడాది మార్చి 23న ప్రొవిజనల్ ఆన్సర్ కీ, ఏప్రిల్ 6న ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ugcnet.nta.nic.in అధికారిక వెబ్సైట్లలో తమ ఫలితాలను పరిశీలించుకోవచ్చు. స్కోర్ కార్డులను చెక్ చేసుకునేందుకు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
చదవండి: పది, ఐటీఐ, డిప్లొమా అర్హతతో కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు... పూర్తి వివరాలు ఇవే
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- ugcnet.nta.nic.in అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
- యూజీసీ నెట్ డిసెంబర్ 2022 రిజల్ట్ లింక్ క్లిక్ చేయండి.
- మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ని నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కండి.
- మీ స్కోర్ కార్డ్ చెక్ చేసుకుని, డౌన్ లోడ్ చేసుకోండి
- రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకుని కాపీ ఉంచుకోవాలి