Skip to main content

Degree Results: డిగ్రీ ఫలితాలు విడుదల

Sri Krishnadevaraya University Degree Results

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది జూలైలో నిర్వహించిన రెగ్యులర్‌ బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ రెండు, నాల్గో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు శుక్రవాం విడుదలయ్యాయి. నాలుగో సెమిస్టర్‌కు సంబంధించి మొత్తం 12,120 మంది పరీక్షలు రాయగా 5,114 మంది ఉత్తీర్ణులై 42.19 శాతం పురోగతి సాధించారు. రెండో సెమిస్టర్‌లో మొత్తం 7,426 మంది పరీక్షలకు హాజరు కాగా 3,481 మంది పాసయ్యారు. 46.88 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు ఈ నెల 16 నుంచి జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించారు. రీవాల్యుయేషన్‌/ పర్సనల్‌ వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రీవాల్యుయేషన్‌/వ్యక్తిగత వెరిఫికేషన్‌ కోసం పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.

చ‌ద‌వండి: AP 10th Class & Inter Exams Time Table 2024: పదోతరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

sakshi education whatsapp channel image link

Published date : 16 Dec 2023 01:37PM

Photo Stories