Skip to main content

M.V.S Degree Results 2023: డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలు విడుదల..

M.V.S Degree Results 2023

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల (అటానమస్‌)కు సంబంధించి డిగ్రీలో రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను సోమవారం పాలమూరు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ లక్ష్మీకాంత్‌రాథోడ్‌, రిజిస్ట్రార్‌ గిరిజామంగ తాయారు, ప్రిన్సిపాల్‌ పద్మావతి విడుదల చేశారు. గ్రూపుల వారీగా ఉత్తీర్ణత వివరాలు ఇలా ఉన్నాయి. బీఏలో 200 విద్యార్థులకు గాను 179మంది (89.50శాతం), బీబీఏలో 33మందికి గాను 29మంది (87.88శాతం), బీకామ్‌లో 211మందికి గాను 175 మంది (82.94 శాతం), బీఎస్సీ సైన్స్‌లో 520మంది విద్యార్థులకు గాను 410మంది (78.84శాతం) ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో పీయూ అడిషనల్‌ కంట్రోలర్‌ రాజ్‌కుమార్‌, కళాశాల కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ రాములు, అడిషనల్‌ కంట్రోలర్లు ఎం.మల్లికార్జున, సూర్యనారాయణ, న్యాక్‌ కో– ఆర్డినేటర్‌ సత్యనారాయణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 25 Jul 2023 08:01PM

Photo Stories