Skip to main content

UPSC Civil Prelims 2022 : సివిల్స్ ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల‌.. మెయిన్స్‌కు ఎంత మంది అర్హ‌త సాధించారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2022 ఫలితాలను జూన్ 22వ తేదీన‌ విడుదల చేశారు.
UPSC Civil Services Prelims 2022 Result
UPSC Civil Services Prelims 2022 Results

యూపీఎస్సీ జూన్ 5న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షల‌ను నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈసారి ఈ ప‌రీక్ష‌కు ఎనిమిది లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. సివిల్‌ సర్వీసెస్‌ నియామక ప్రక్రియలో తొలి మెట్టు ప్రిలిమ్స్‌. అభ్యర్థులు దీనిలో విజయం సాధిస్తే తర్వాత అంచెల్లో నిర్వహించే మెయిన్స్, ఇంటర్వ్యూలకు హాజరై.. వాటిలో ప్రతిభ చూపి దేశంలోని అత్యున్నత సర్వీసుల్లో చేరొచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్‌ని త్వరలోనే విడుదల చేయనుంది. మొత్తం 861 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.

Civils Interview Important Tips: ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే.. సివిల్స్ ఇంటర్వ్యూలో విజ‌యం మీదే..!

How to Check UPSC Civil Services Prelims Result 2022 

➤ Visit the official UPSC website – upsc.gov.in/

➤ Click on Result - CIVIL SERVICES (PRELIMINARY) EXAMINATION, 2022

➤ PDF Page will be open

➤ Search you Roll Numbers

UPSC Civil Services-2022 Prelims Key : సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌) కొశ్చ‌న్ పేప‌ర్ & కీ కోసం క్లిక్ చేయండి

సివిల్స్ ప్రిలిమ్స్‌లో..
పేపర్‌–1 (జ‌న‌ర‌ల్ స్డ‌డీస్) ప్ర‌శ్న‌ప‌త్రంలో 100 ప్రశ్నలు 200 మార్కుల‌కు నిర్వ‌హించారు. అలాగే పేపర్‌–2(అప్టిట్యూడ్‌ టెస్ట్‌–సీశాట్‌)ను 80 ప్రశ్నలతో 200 మార్కుల‌కు నిర్వ‌హించారు.

☛ యూపీఎస్సీ సివిల్స్-2022 ప్రిలిమ్స్‌ పేపర్‌ 2(సీశాట్‌) కోసం క్లిక్ చేయండి

ప్రిలిమ్స్‌కు క్వాలిఫై అయినవారు..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినవారు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 1 పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన తేదీలు, నియమ నిబంధనల్ని యూపీఎస్‌సీ త్వరలోనే వెల్లడించనుంది. అభ్యర్థులు పూర్తి వివ‌రాల‌ను యూపీఎస్‌సీ సివిల్స్‌ అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.in ద్వారా చెక్ చేసుకోవాలి.

UPSC Civil Services Prelims Result 2022 Direct Link

Published date : 22 Jun 2022 06:54PM

Photo Stories