Skip to main content

విశ్లేషణాత్మకంగా..సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్ - 2

త్వరలో సివిల్స్ ప్రిలిమినరీ రాసేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు దాదాపుగా ఇప్పటికే తమ ప్రిపరేషన్ పూర్తి చేసి ఉంటారు. మరికొంత మంది పూర్తిగా కాకున్నా కనీసం కొంతమేరకైనా సన్నద్ధమై ఉంటారు. పరీక్ష రాయడానికి నేటి నుంచి సరిగ్గా 52 రోజుల సమయం ఉంటుంది. ఈ తక్కువ సమయంలో పేపర్-2 ముఖ్యంగా బేసిక్ న్యూమరసి, అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డెసిషన్‌మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీలకు ఎలా సాధన చేయాలో తెలుసుకుందాం...

లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ అంశాలతో ఉండే ఈ పేపర్‌లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ మాత్రమే మ్యాథ్స్‌తో సంబంధం కలిగి ఉన్నాయి. అవి కూడా ప్యూర్ మ్యాథ్స్ కాకుండా.. పదో తరగతి స్థాయిలో అర్థమెటిక్, న్యూమరికల్ స్కిల్స్ ఉన్న ప్రతి విద్యార్థి సాధించే విధంగానే ఉంటాయి.

గతంలో:
ముందుగా మీరు పేపర్-2లో టాపిక్‌ల వారీగా ఏయే టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో తెలుసుకోవాలి. దీనితోపాటు 2012, 2013 ప్రశ్నపత్రాల సాధనకు సమయం కేటాయించాలి. గత మూడు సంవత్సరాలలో ఈ పేపర్‌లో టాపిక్‌ల వారీగా వచ్చిన ప్రశ్నల సంఖ్యను కింది పట్టికను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది.
అంశం 2012 2013
కాంప్రహెన్షన్ 32 23
బేసిక్ న్యుమరసీ 03 19
డెసిషన్ మేకింగ్ అండ్పాబ్లమ్ సాల్వింగ్ 07 06
అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ 14 16
జనరల్ మెంటల్ ఎబిలిటీ 16 08
ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఇన్‌క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ - -
ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ 08 08
మొత్తం 80 80

కీలకం:
Bavitha పేపర్-2లో అత్యంత ముఖ్యమైనది, ఎక్కువ మార్కులు వస్తున్న అంశం లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ.
రీజనింగ్ అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని తెలుపుతుంది. క్లిష్ట సమయాల్లో అభ్యర్థి ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకోగలరో తెలుసుకోవడానికి ఈ అంశాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో Inferences, Syllogism (Two statements syllogism, three statements syllogism), Reasoning with arguments, Reasoning with Assumptions, Course of action, Reading passages పై ఎక్కువగా దృష్టి సారించాలి. ఈ ప్రశ్నల కోసం అభ్యర్థులు కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు. ఇచ్చిన అంశాలనే జాగ్రత్తగా పరిశీలిస్తే అందులోనే సమాధానాలు కనిపిస్తాయి.

డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్:
ఒక ప్రభుత్వ అధికారికి ఈ స్కిల్స్ ఎంతో అవసరం. ఇందులో కొంత సమాచారం ఇచ్చి, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు అభ్యర్థి స్పందన ఎలా ఉంటుందో తెలుసు కునేలా ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేటప్పుడు.. ప్రశ్నలో ఇచ్చిన విషయంపై అవగాహన కలిగి ఉండాలి. దాని ప్రాముఖ్యత ఏమిటి? అది అతి ముఖ్యమైన విషయమా? కాదా? అత్యవసరమైన విషయమా కాదా? లేదా రెండూనా? వీటికి సంబంధించి ఏ సమాచారం అందుబాటులో ఉంది? ఇచ్చిన సమస్యకు సంబంధించి అనుకూలమైన అంశాలు ఏమేమి ఉన్నాయి? ప్రతి అనుకూల అంశానికి మెరిట్స్, డీమెరిట్స్ పరిశీలించి వీటి ఆధారంగా సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిత్యజీవితంలో ఎదురయ్యే ఏదో ఒక సమస్య ఇచ్చి, ఆ సందర్భంలో మీరు (అభ్యర్థి) ఉంటే ఏం చేస్తారని అడిగి, నాలుగు ఆప్షన్‌‌స ఇస్తారు. అవి నాలుగు కూడా సరైన సమాధానాలుగా ఉండొచ్చు. ఇలాంటప్పుడు అందులో బెస్ట్‌గా ఉన్న సమాధానాన్ని ఎన్నుకోవాలి.

జనరల్ మెంటల్ ఎబిలిటీ:
పరీక్ష కోణంలో ఈ అంశానికి కూడా అధిక ప్రాముఖ్యత ఉంది. ఇందులో ముఖ్యంగా రెండు రకాల ప్రశ్నలు ఉన్నాయి. అవి... వెర్బల్ రీజనింగ్ , నాన్ వెర్బల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్ ప్రశ్నలకు త్వరగా సమాధానాలు గుర్తించాలంటే కింది అంశాలపై పట్టు సాధించాలంటే.. A నుంచి Z వరకు, Z నుంచి A వరకు వేగంగా చదవగలగడం, A నుంచి Z వరకు వాటి స్థాన విలువలు (A-1, B-2, ... Z-26), A నుంచి Z వరకు తిరోగమన స్థాన విలువలు (A-26, B-25, ... Z-1), A నుంచి Z వరకు తిరోగమన స్థానాక్షరాలు (A-Z, B-Y, C-X, ... Z-A, Y-B..), వివిధ రకాల సంఖ్యలపై అవగాహన 1 నుంచి 15 వరకు ఘనాలు, 1 నుంచి 35 వరకు వర్గాలు, 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు, 20 వరకు టేబుల్స్ (ఎక్కాలు)పై అవగాహన పెంచుకోవాలి. వీటితోపాటు సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, రక్త సంబంధాలు, దిక్కులు, తార్కిక వెన్ చిత్రాలు, గణిత పరిక్రియలు, ఒక పట్టికలో లోపించిన సంఖ్యలు లేదా అక్షరాలపై కూడా దృష్టి సారించాలి.

బేసిక్ న్యూమరసీ:
ఈ విభాగంలోని ప్రశ్నల విశ్లేషణ.. ఇంటర్, డిగ్రీలలో అభ్యర్థులు ఏ గ్రూప్ తీసుకున్నా పదోతరగతి వరకు అందరూ తప్పనిసరిగా గణితాన్ని చదివిన వారే. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు గణితంలో ఉన్న అంశాలనే ప్రాథమిక సంఖ్యావాదం, సూక్ష్మీకరణ, కాలం- దూరం, కాలం-పని, సరాసరి, నిష్పత్తి- అనుపాతం, శాతాలు, కసాగు, గసాభా, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, లాభం-నష్టం, భాగస్వామ్యం, వైశాల్యాలు, ఘనపరిమాణాలు, ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత మొద లైన అంశాలపై ప్రశ్నలు సాధన చేయాలి. దీనికోసం హైస్కూల్ గణిత పుస్తకాలను సాధన చేస్తే సరిపోతుంది. ఈ ప్రశ్నలను వేగంగా చేయాలంటే ప్రాథమిక సంఖ్యావాదం - వివిధ రకాల సంఖ్యలు, భాజనీయత సూత్రాలు, 35 వరకు వర్గాలు, 15 వరకు ఘనాలు, 100లోపు గల ప్రధాన సంఖ్యలు, 20 వరకు ఎక్కాలు, కూడిక, తీసివేత, గుణకారం, భాగహారాలను వేగంగా చేయడంపై అవగాహన పెంచుకోవాలి.

గత ప్రశ్నలు
2011 questions
  • A contract on construction job specifies a penalty for delay in completion of the work beyond a certain date is as follows : Rs. 200 for the first day , Rs. 250 for the second day, Rs. 300 for the third day etc., the penalty for each succeeding day being Rs. 50 more than that of the preceding day. How much penalty should the contractor pay if he delays the work by 10 days?
    1) Rs. 4950
    2) Rs. 4250
    3) Rs 3600
    4) Rs. 650
    Ans: 2
  • A person has only Rs. 1 and Rs. 2 coins with her. If the total number of coins that she has is 50 and the amount of money with her is Rs. 75, then the number of Rs. 1 and Rs. 2 coins are, respectively
    1) 15 and 35
    2) 35 and 15
    3) 30 and 20
    4) 25 and 25
    Ans: 4
  • Three persons start walking together and their steps measure 40 cm, 42 cm and 45 cm respectively. What is the minimum distance each should walk so that each can cover the same distance in complete steps?
    1) 25 m 20 cm
    2) 50 m 40 cm
    3) 75 m 60 cm
    4) 100 m 80 cm
    Ans: 1
  • If a bus travels 160 km in 4 hours and a train travels 320 km in 5 hours at uniform speeds, then what is the ratio of the distances travelled by them in one hour?
    1) 8 : 5
    2) 5 : 8
    3) 4 : 5
    4) 1 : 2
    Ans: 2
  • There are 100 students in a particular class. 60% students play cricket, 30% student play football and 10% students play both the games. What is the number of students who play neither cricket nor football?
    1) 25
    2) 20
    3) 18
    4) 15
    Ans: 2
  • A village having a population of 4000 requires 150 liters of water per head per day. It has a tank measuring 20 m, 15 m, 6 m. The water of this tank will last for
    1) 2 days
    2) 3 days
    3) 4 days
    4) 5 days
    Ans: 2

    2012 questions
  • Mr. Kumar drives to work at an average speed of 48 km per hour. The time taken to cover the first 60% of the distance is 10 minutes more than the time taken to coverthe remaining distance. How far is his office?
    1) 30 km
    2) 40 km
    3) 45 km
    4) 48 km
    Ans: 2
  • Two glasses of equal volume are respectively half and three-fourths filled with milk. They are then filled to the brim by adding water. Their contents are then poured into another vessel. What will be the ratio of milk to water in this vessel?
    1) 1 : 3
    2) 2 : 3
    3) 3 : 2
    4) 5 : 3
    Ans: 4

    2013 questions
  • In a rare coin collection, there is one gold coin for every three non-gold coins. 10 more gold coins are added to the collection and the ratio of gold coins to non-gold coins would be 1: 2. Based on the information; the total number of coins in the collection now becomes
    1) 90
    2) 80
    3) 60
    4) 50
    Ans: 1
  • A gardener has 1000 plants: He wants to plant them in such a way that the number of rows and the number of columns remains the same. What is the minimum number of plants that he needs more for this purpose?
    1) 14
    2) 24
    3) 32
    4) 34
    Ans: 2
  • A sum of RS. 700 has to be used to give seven cash prizes to the students of a school for their overall academic performance. If each prize is RS. 20 less than its preceding prize, what is the least value of the prize?
    1) RS. 30
    2) RS. 40
    3) RS. 60
    4) RS. 80
    Ans: 2
  • Out of 120 applications for a post, 70 are male and 80 have a driver's license. What is the ratio between the minimum to maximum number of males having driver's license?
    1) 1 to 2
    2) 2 to 3
    3) 3 to 7
    4) 5 to 7
    Ans: 3
  • In a garrison, there was food for 1000 soldiers for one month. After 10 days, 1000 more soldiers joined the garrison. How long would the soldiers be able to carry on with the remaining food?
    1) 25 days
    2) 20 days
    3) 15 days
    4) 10 days
    Ans: 4
  • The tank-full petrol in Arun's motor-cycle lasts for 10 days. If he starts using 25% more every day, how many days will the tank-full petrol last?
    1) 5
    2) 6
    3) 7
    4) 8
    Ans: 4
  • A thief running at 8 km/hr is chased by a policeman whose speed is 10 km/hr. If the thief is 100 m ahead of the policeman, then the time required for the policeman to catch the thief will be
    1) 2 min
    2) 3 min
    3) 4 min
    4) 6 min
    Ans: 2
Published date : 04 Jul 2014 11:55AM

Photo Stories