TS PGECET Hall Tickets Released: పీజీఈసెట్ హాల్‌టికెట్స్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS PGECET)- 2024 హాల్‌టికెట్స్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలను ఎంటర్‌చేసి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా తెలంగాణ పీజీఈసెట్ పరీక్షలు జూన్ 10-13వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది.ఉదయం 10-12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2-4 గంటల వరకు రెండో సెషన్‌ను నిర్వహించనున్నారు.
AP ECET Results Released: ఈసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
జేఎన్‌టీయూ హైదరాబాద్ ఈ ఏడాది PGECET పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్ష ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్.డి(పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణ పీజీ ఈసెట్ రిజల్ట్స్ కోసం అభ్యర్థులు డైరెక్ట్ లింక్ https://pgecet.tsche.ac.in/TSPGECET/PGECET_Hall_Ticket_2024HT.aspx ను క్లిక్ చేయండి.