ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కళాశాలల్లోని ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు 2న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు
యూనివర్సిటీలోని అడ్మిషన్ల కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్పాట్ అడ్మిషన్లలో సీట్లు పొందగోరే విద్యార్థులు ఏపీపీజీఈసెట్–2021 ర్యాంకు కలిగి ఉండాలి. ర్యాంకు ప్రాధాన్యం ప్రకారం సీట్లు కేటాయించాక మిగిలిన సీట్లను సంబంధిత డిగ్రీలో 50 శాతం మార్కులున్న ఓసీ, 45 శాతం మార్కుల కన్నా ఎక్కువ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు కేటాయిస్తారు. స్పాట్ అడ్మిషన్ లో సీటు పొందిన అభ్యర్థులకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వర్తించవు.