Skip to main content

GAT-B & BET 2024: పీజీ కోర్సులో ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌-బయో టెక్నాలజీ(జీఏటీ-బీ)2024, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌(బీఈటీ)-2024 ప్రకటన వెలువడింది. ఎన్‌టీఏ నిర్వహించే ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ద్వారా వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్శిటీల్లో పీజీ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.
GAT B and BET 2024 NTA Exam

కోర్సుల వివరాలు
జీఏటీ-బీ కోర్సులు: ఎంఎస్సీ(బయోటెక్నాలజీ, అగ్రి బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు), ఎంటెక్‌(బయో టెక్నాలజీ, సంబంధిత విభాగాలు), ఎంవీఎస్సీ(యానిమల్‌ బయోటెక్నాలజీ).
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ, బీటెక్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

బీఈటీ కోర్సులు: ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందవచ్చు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబం«ధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మసీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు, దివ్యాంగులు,మహిళలు 31ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపుకు చివరితేది: 06.03.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 08.03.2024 నుంచి 09.03.2024 వరకు.
పరీక్ష తేది: 20.04.2024

వెబ్‌సైట్‌: https://dbt.ntaonline.in/ or https://www.nta.ac.in/

చదవండి: APSET Notification 2024: ఏపీ సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

Published date : 15 Feb 2024 06:54PM

Photo Stories