Scholarship Scheme: సీసీఆర్‌టీ–కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ స్కీమ్.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్‌టీ) సంస్థ 2021–22, 2022–23 సంవత్సరాలకు గాను కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ స్కీమ్ ద్వారా వివిధ కళల్లో ప్రావీణ్యమున్న యువ కళాకారులకు ఉపకార వేతనాలు అందిస్తోంది.
ఉపకార వేతనాల సంఖ్య: 650 (జనరల్ కేటగిరీలు, ఇతరులకు–375; సాంప్రదాయ కళాకారుల కుటుంబాలకు–125; ట్రైబల్ కల్చర్/ఎస్టీలకు–100; దివ్యాంగులకు–20;క్రియేటివ్ రైటింగ్, లిటరరీ ఆర్టిస్ట్‌లకు–30)
కళలు: సంప్రదాయ సంగీతం, సంప్రదాయ నృత్యం, నాటకం, మైమ్, చిత్రకళ, జానపదం, లైట్ క్లాసికల్ మ్యూజిక్.
ఆర్థిక సహాయం: ఏడాదికి రూ.3600 ఉపకార వేతనంతోపాటు ట్యూషన్ ఫీజు కింద ఏడాదికి రూ.9000 చెల్లిస్తారు.
వ్యవధి: రెండేళ్లు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత రాష్ట్రాల సీసీఆర్‌టీ కేంద్రాలకు(న్యూఢిల్లీ, హైదరాబాద్, రాజస్థాన్, అసోం, మధ్యప్రదేశ్) దరఖాస్తులు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.04.2022
వెబ్‌సైట్: http://www.ccrtindia.gov.in/