Scholarships: మైనారిటీ బాలికల కోసం బేగం హజ్రత్ మహల్ స్కాలర్‌షిప్
ప్రతిభ కలిగిన మైనారిటీ బాలికల చదువును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బేగం హజ్రత్ మహల్ స్కాలర్‌షిప్ పథకం అమలు చేస్తోంది. ఢిల్లీలోని మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తోంది. ఇది కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది.
అర్హతలు
తొమ్మిది, పది, ఇంటర్ మొదటి, రెండో ఏడాది చదువున్న మైనారిటీ (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్దులు, జైనులు, పార్సీలు) బాలికలు ఈ స్కాలర్‌షిప్ దరఖాస్తుకు అర్హులు. కుటుంబ వార్షికాదాయం రెండు లక్షలకు మించకుండా ఉండాలి. అకడమిక్ మెరిట్ పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. చదువు మ«ధ్యలో మానేసిన వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇతర స్కాలర్‌షిప్స్ పొందేవారు అనర్హులు.
నేరుగా ఖాతాకే
ఈ స్కాలర్‌షిప్స్‌కు ఎంపికైన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి రూ.5000, అలాగే 11, 12 తరగతి చదివే విద్యార్థులకు సంవత్సరానికి రూ.6000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. విద్యార్థి బ్యాంక్ ఖాతాలోకి నేరుగా సదరు మొత్తాన్ని జమచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021
వెబ్‌సైట్: https://www.maef.nic.in/
చదవండి: AICTE Scholarship: ఈ పథకానికి ఎంపికైన ప్రతి విద్యార్థినికి ఏడాదికి రూ.50వేలు...