Skip to main content

Cadet Entry Scheme 2023: ఇండియన్‌ నేవీ– కేడెట్‌ ఎంట్రీ స్కీమ్‌

ఇండియన్‌ నేవీ.. ఎగ్జిక్యూటివ్, టెక్నికల్‌ బ్రాంచ్‌ల్లో నాలుగేళ్ల బీటెక్‌ కోర్సు(10+2 క్యాడెట్‌ ఎంట్రీ) స్కీమ్‌లో అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడెమీలో శిక్షణ ఉంటుంది.
indian navy cadet entry scheme 2023

కోర్సు వివరాలు: 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ 
బ్రాంచ్‌ వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ కోర్సు
మొత్తం ఖాళీలు: 30 (మహిళలకు 09)
విద్యార్హత: ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులలో కనీసం 70 శాతం మార్కులు సాధించాలి. ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: అభ్యర్థులు 2004 జూలై 02 నుంచి 2007 జనవరి 1 మ«ధ్య జన్మించి ఉండాలి. 

ఎంపిక విధానం: జేఈఈ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 30.06.2023

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

Technical Entry Scheme: ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Last Date

Photo Stories