Skip to main content

KNRUHS: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు సెప్టెంబ‌ర్ 25 సాయంత్రం 4 గంటల నుంచి 26 సాయంత్రం 4 గంటల వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
KNRUHS
ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌

 రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయింది. అయితే కన్వీనర్‌ కోటాలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ రౌండ్‌లో భర్తీ చేయనున్నారు. అర్హత, నిబంధనలు, ఇతర వివరాల కోసం  www.knruhs.telangana.gov వెబ్‌సైట్‌ చూడాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.  

Published date : 26 Sep 2023 12:18PM

Photo Stories