Skip to main content

NEET 2022: ప్రిలిమినరీ ‘కీ’పై విద్యార్థుల ఆందోళన

NTA ఆగస్టు 31న విడుదల చేసిన NEET–2022 ప్రిలిమినరీ ‘కీ’పై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NEET 2022
నీట్ ప్రిలిమినరీ ‘కీ’పై విద్యార్థుల ఆందోళన

పరీక్షలో వచ్చిన ప్రశ్నలు కొన్ని అస్పష్టంగా, కాన్సెప్ట్‌కు విరుద్ధంగా ఉన్నాయని నీట్‌కు హాజరైన శ్రీచైతన్య విద్యార్థులు తెలిపారు. ప్రత్యేకించి భౌతిక శాస్త్రంలో ఫొటో ఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన ప్రశ్న పూర్తిగా భావనకు విరుద్ధంగా ఉందని వదిలేశామని, Preliminary ‘KEY’లో NTA ఆ లోపాన్ని గుర్తించలేదన్నారు. వృక్షశాస్త్రంలో, కెమిస్ట్రీలోనూ ఇలాంటి తప్పులు దొర్లాయన్నారు. ఇలాంటి తప్పుల వల్ల తాము కొన్ని మార్కులు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న శ్రీచైతన్య నిపుణుల కమిటీ సైతం ప్రిలిమనరీ ‘కీ’ని పరిశీలించింది. విద్యార్థుల అభిప్రాయాలతో ఏకీభవించిన ఆ కమిటీ.. ఫైనల్‌ ‘కీ’లోనైనా లోపాలను సవరించి, విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్‌టీఏను కోరింది. 

చదవండి:

Published date : 02 Sep 2022 04:06PM

Photo Stories