KNRUHS: వైద్య విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే..
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం జనవరి 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష (నీట్–2021)లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. జనవరి 5న ఉదయం 8 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉప కులపతి డాక్టర్ కరుణాకర్రెడ్డి సూచించారు. దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత సర్టీఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టీఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.inను సందర్శించాలి.
చదవండి:
BS Murty: బయోమెడికల్, బయో ఇన్ఫర్మేటిక్ ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభిస్తాం
Harshanth Sairam: ‘పీజీ సూపర్‌స్పెషాలిటీ’లో ఖమ్మంవాసికి ఫస్ట్ ర్యాంక్