Skip to main content

నీట్‌ పీజీ వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు

వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్‌ పీజీ–22 పరీక్ష వాయిదా కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
NEET PG cannot be postponed
నీట్ పీజీ వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు

ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది. ఇలా వాయిదా వేసుకుంటూ పోతే వైద్యులు అందుబాటులోకి రాక ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించింది. ‘‘పరీక్ష వాయిదా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ఇలాంటప్పుడు పరీక్ష వాయిదా కుదరదు’’ అని పేర్కొంది. పరీక్ష మే 21న జరగనుంది. అప్పుడే నీట్‌–పీజీ–2021 కౌన్సెలింగ్‌ ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు వైద్యులు కోర్టుకెక్కారు.

Sakshi Education Mobile App
Published date : 14 May 2022 02:56PM

Photo Stories