Skip to main content

NEET MDS: పరీక్ష వాయిదా!

NEET MDS Exam postponed
NEET MDS Exam postponed

సాక్షి, హైదరాబాద్‌: డెంటల్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ సీట్లలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, ఎండీఎస్‌–2022 పరీక్షను 4 నుంచి 6 వారాల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలోపు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన బీడీఎస్‌ విద్యార్థులకు నీట్‌ ఎండీఎస్‌ పరీక్ష రాసేందుకు అర్హత లభిస్తుంది. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో డెంటల్‌ విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌ను నిర్ధేశిత గడువులోపు పూర్తి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇంటర్న్‌షిప్‌ గడువు తేదీని పొడిగించాలని, ఈ విద్యార్థులు నీట్‌ ఎండీఎస్‌ పరీక్ష రాయడానికి వీలుగా తేదీని మార్చాలని పలు డెంటల్‌ కాలేజీలు కోరడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. మార్చి 31తో పూర్తి కావాల్సిన ఇంటర్న్‌షిప్‌ గడువును జూలై 31 వరకు పొడిగించింది. ఈ గడువు తేదీ నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన డెంటల్‌ విద్యార్థులు నీట్‌ ఎండీఎస్‌ రాయడానికి అర్హత పొందుతారని పేర్కొంది.

 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 18 Feb 2022 02:54PM

Photo Stories