NEET: ‘నీట్’ పరీక్ష రద్దుకు సహకరించండి
Sakshi Education
విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న ‘నీట్’పరీక్ష రద్దు కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని డీఎంకే ఎంపీ ఇలంగోవన్ మంత్రి కేటీఆర్‌ను కోరారు.
ఇలంగోవన్ నేతృత్వంలోని డీఎంకే ఎంపీల బృందం అక్టోబర్ 13న కేటీఆర్‌ను తెలంగాణ భవన్ లో కలిసింది. వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకోసం కేంద్రం నిర్వహిస్తున్న నీట్ పరీక్షను రద్దు చేయాలని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో తాము పోరాడుతున్నామని ఇలంగోవన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కీలక అంశాలపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. నీట్ రద్దుపై తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ డీఎంకే ఎంపీలు మంత్రి కేటీఆర్‌కు లేఖను అందజేశారని టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
చదవండి:
EAMCET: ఎంత ర్యాంకొస్తే.. కంప్యూటర్స్ కోర్సుల్లో సీటు వస్తుంది: నిపుణుల అంచనా
Published date : 14 Oct 2021 04:14PM