Skip to main content

NEET: కౌన్సెలింగ్‌ వెంటనే చేపట్టాలి..

నీట్‌ పీజీ–2021 కౌన్సెలింగ్‌ను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు డిసెంబర్‌ 1న సికింద్రాబాద్‌ గాందీఆస్పత్రిలో ఔట్‌ పేషెంట్‌ విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
NEET
నీట్ కౌన్సెలింగ్‌ వెంటనే చేపట్టాలి..

తెలంగాణ జూడా అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్‌ కార్తీక్, డాక్టర్‌ మణికిరణ్‌ మాట్లాడుతూ.. నీట్‌ కౌన్సెలింగ్‌ ఇంకా జాప్యమైతే దేశంలోని సుమారు 45 వేలమంది వైద్య విద్యార్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం స్పందించి సుప్రీంకోర్టులోని పెండింగ్‌ కేసులను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకుంటే డిసెంబర్‌ 4 నుంచి ఓపీతోపాటు సాధారణ విధులను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు. జూడాల విధుల బహిష్కరణతో ఓపీ వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. నిరుపేద రోగులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని, ఓపీలో 1,017, ఇన్ పేషెంట్‌ విభాగంలో 1,067 మంది రోగులకు సేవలు అందించామని సూపరిం టెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు.

చదవండి: 

NEET 2021: నీట్‌ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల

EWS: ఈడబ్ల్యూఎస్‌ కోటా.. ఎంబీబీఎస్‌కు కేటాయించిన సీట్లు సంఖ్య!

 

Published date : 02 Dec 2021 05:17PM

Photo Stories