Skip to main content

NEET 2021: నీట్‌ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల

నీట్‌–2021 యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులను నవంబర్‌ 20న తెలంగాణ లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది.
NEET 2021
నీట్‌ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల

ఈ జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ర్యాంకుల జాబితా సమాచారం నిమిత్తమేనని, వర్సిటీకి దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్‌ జాబితా విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ముందుగా రిజి్రస్టేషన్‌ ప్రక్రియకు నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని, అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా విడుదల చేసిన తర్వాత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వివరించింది. నీట్‌–21 యూజీ అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం ఇంకా నోటిఫికేష¯ŒS విడుదల చేయలేదు. అడ్మిషన్ల షెడ్యూల్‌ ఖరారైన తర్వాత కాళోజీ వర్సిటీ కౌన్సెలింగ్‌ చేపట్టనుంది.

నీట్‌ కటాఫ్‌ స్కోర్‌ వివరాలు:

జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి 50 పర్సంటైల్, కట్‌ ఆఫ్‌ స్కోర్‌ 138 మార్కులు

  • ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40 పర్సంటైల్, కట్‌ ఆఫ్‌ స్కోర్‌ 108 మార్కులు
  • పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 పర్సంటైల్, కట్‌ ఆఫ్‌ స్కోర్‌ 122 మార్కులు 

ర్యాంకుల విడుదల అనంతరం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నుంచి రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాలు అందాయి. రాష్ట్ర స్థాయిలో మొదటి 10 ర్యాంకులు పొందిన అభ్యర్థులు..

1

మృణాల్‌ కుట్టేరి

2

ఖండవల్లి శశాంక్‌

3

కాసా లహరి

4

ఏమని శ్రీనిజ

5

దాసిక శ్రీ నిహారిక

6

పసుపునూరి శరణ్య

7

బొల్లినేని విశ్వాస్‌రావు

8

కన్నెకంటి లాస్య చౌదరి

9

గజ్జల సమీహన రెడ్డి

10

గాండ్ల ప్రమోద్‌ కుమార్‌

చదవండి:

Education: ఉపాధి వేటలో విజయం సాధించేలా కోర్సులు

NEET: నీట్‌ తేలేదెప్పుడు..? క్లాసులు కదిలేదెప్పుడు..?

NEET: డాక్టరమ్మ...

Published date : 22 Nov 2021 03:32PM

Photo Stories