NEET: ‘నీట్’ కోటాపై కేంద్రం, ఎంసీసీకి సుప్రీం నోటీసు
Sakshi Education
వైద్య విద్య, డెంటల్ కోర్సుల్లో 2021–22లో ‘నీట్’ ద్వారా ప్రవేశాల విషయంలో ఇతర వెనుకబడిన తరగతులకు(ఓబీసీ) 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం కోటా కల్పిస్తూ జూలై 29న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెబర్ 17న విచారణ చేపట్టింది.
దీనిపై స్పందించాలని కేంద్రానికి, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీకి(ఎంసీసీ) సూచించింది. ఈ మేరకు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం నోటీసు జారీ చేసింది. జూలై 29 నాటికి నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 8 మంది పిటిషన్లు దాఖలు చేశారు. వీరిలో ‘నీట్’ పీజీ పరీక్ష రాసినవాళ్లు కూడా ఉన్నారు. కేంద్ర జారీ చేసిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. పీజీ మెడికల్ కోర్సుల సీట్లు ఇప్పటికే చాలా పరిమితంగా ఉన్నాయని, వాటిని రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేయడం సరైంది కాదని, దీనివల్ల ప్రతిభావంతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
చదవండి:
NEET MDS: పీజీ దంత వైద్య కోర్సుల ప్రవేశాలకు ప్రకటన..చివరి ఇదే..
Published date : 18 Sep 2021 02:46PM