Skip to main content

NEET: నీట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం

మెడికల్‌ ప్రవేశపరీక్ష నీట్‌ నుంచి పూర్తిగా మినహాయింపు కోరుతూ సీఎం ఎంకే స్టాలిన్‌ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
NEET
నీట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం

తమిళ విద్యార్థులకు నీట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని స్టాలిన్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తీర్మానానికి సంపూర్ణ మద్దతునివ్వాలని విపక్షాలను కోరారు.

‘నీట్‌’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై ఒత్తిడి పెంచుకుని తాజాగా ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబ‌ర్‌ 13న‌ అసెంబ్లీలో నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ప్రతిప‌క్ష అన్నా డీఎంకే మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.

త‌మిళ‌నాడులో నీట్‌ జ‌రుగుతుందా లేదా తెలియ‌క విద్యార్థులు, త‌ల్లిదండ్రులు అయోమ‌యానికి గుర‌య్యార‌ని, చివ‌రికి విద్యార్థి ఆత్మహ‌త్య గురించి కూడా అసెంబ్లీలో చ‌ర్చించ‌నివ్వలేద‌ని ప్రతిప‌క్ష నేత ప‌ళ‌నిస్వామి ఆరోపించారు. నీట్‌పై డీఎంకే ప్రభుత్వం స్పష్టమైన వైఖ‌రి అవ‌లంబించ‌లేద‌ని మండిపడ్డారు. నీట్‌ను ర‌ద్దు చేస్తార‌నుకొని విద్యార్థులు ఆ ప‌రీక్షకు సిద్ధం కాలేదు. ఆ విద్యార్థి ఆత్మహ‌త్యకు ప్రభుత్వానిదే బాధ్యత‌. దీనికి నిర‌స‌న‌గా వాకౌట్ చేస్తున్నామని, అయితే నీట్ తీర్మానానికి మ‌ద్దతిస్తున్నామని ప‌ళ‌నిస్వామి అన్నారు.

చదవండి: 

NEET-UG 2021: Over 95% of registered candidates appeared across India

NEET 2021: బయాలజీ ఈజీ... కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ కఠినం...

Published date : 14 Sep 2021 03:34PM

Photo Stories