NEET 2024 Results: ఆటో డ్రైవర్ కొడుకుకు నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జాతీయ ర్యాంక్
మంచిర్యాంకులు సాధించి వైద్యవిద్య అభ్యసించడానికి మార్గం సుగమం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీకి చెందిన సగ్గం ముత్యం–లక్ష్మి దంపతుల చిన్న కుమారుడు అఖిల్‌సాయి నీట్ ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో 720 మార్కులకు గాను 691 సాధించి సత్తా చాటాడు.
చదవండి: NEET 2024 Results: ఇన్ని లక్షల ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు!
జాతీయ స్థాయిలో 4,051, ఓబీసీ కేటగిరీలో 1,536 ర్యాంక్ సాధించాడు. అఖిల్‌సాయి ఐదో తరగతివరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్థానిక జుమ్మెరాత్‌పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 9, 10 తరగతులను జిల్లా కేంద్రంలోని విన్నర్స్ ఒలింపియాడ్ స్కూల్‌లో చదివాడు.
హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి ఇటీవల విడుదలైన నీట్ పరీక్షా ఫలితాల్లో ఎంబీబీఎస్‌లో సీటు సాధించాడు. లఖిల్‌సాయి తండ్రి ముత్యం దివ్యాంగుడైనప్పటికీ జిల్లా కేంద్రంలో ఆటో నడుపుతుండగా, తల్లి లక్ష్మి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా, జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన అఖిల్‌సాయిని పలువురు అభినందించారు.
చదవండి: NEET 2024 Results: ఆలిండియా నీట్ ఫస్ట్ ర్యాంకర్‌గా గుగులోత్ వెంకట నృపేష్