National Film Awards 2022 : ఉత్తమ చిత్రంగా సూరారై పోట్రు
2020 గాను 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం జూలై 22న ప్రకటించింది. ఇందులో దక్షిణాది సినిమాదే పైచేయిగా నిలిచింది. తమిళ చిత్రపరిశ్రమకు పది, మలయాళంకి తొమ్మిది, తెలుగుకి నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ చిత్రం (సూరరై పోట్రు), నటుడు (సూర్య), నటి (అపర్ణ), స్క్రీన్ ప్లే (సుధ కొంగర), నేపథ్య సంగీతం (జీవీ ప్రకాశ్‌కుమార్).. ఇలా మొత్తం ఐదు అవార్డులు ‘సూరరై పోట్రు’కి దక్కాయి. కాగా ఉత్తమ నటుడి అవార్డుకి సూర్యతో పాటు అజయ్ దేవగన్ (‘తన్హాజీ’)ని ఎంపిక చేశారు. తెలుగులో జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా తమన్ (‘అల.. వైకుంఠపురములో’), ‘నాట్యం’చిత్రకథానాయిక సంధ్యారాజుకి ఉత్తమ కొరియోగ్రఫీకి, ఇదే చిత్రానికిగాను టీవీ రాంబాబుకి ఉత్తమ మేకప్ అవార్డులు దక్కాయి.
Also read: Central Sahitya Akademi Award: సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు
జాతీయ సినిమా అవార్డులు
- ఉత్తమ చిత్రం : సూరరై పోట్రు
- ఉత్తమ నటులు : సూర్య (సూరరై పోట్రు) , అజయ్ దేవగన్ (తానాజీ)
- ఉత్తమ నటి : అపర్ణ (సూరరై పోట్రు)
- ఉత్తమ దర్శకుడు : సచ్చిదానందన్ (అయ్యప్పన్ కోషియమ్ )
- ఉత్తమ స్క్రీన్ ప్లే: షాలిని ఉషా నయ్యర్, సుధా కొంగర (సూరరైపోట్రు – తమిళం)
- ఉత్తమ సంగీత దర్శకుడు : తమన్ ( అల వైకుంఠపురములో)
- ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రం : కలర్ ఫొటో
- ఉత్తమ నేపథ్య సంగీతం : జీవీ ప్రకాశ్‌కుమార్( సూరరై పోట్రు)
- ఉత్తమ కొరియోగ్రఫీ : సంధ్యారాజు ( నాట్యం )
- ఉత్తమ సహాయ నటుడు : బీజూ మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్)
- ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్)
- ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ : అనిశ్ మంగేశ్ గోస్వామి (టక్‌టక్), ఆకాంక్షా పింగ్లే, దివ్వేష్ తెందుల్కర్ (సుమీ)
- ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్
- ఉత్తమ కన్నడ చిత్రం: డోలు
- ఉత్తమ మలయాళం చిత్రం: తింకలచ్చ నిశ్చయమ్
- ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్
- ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠి)
- ఇందిరాగాందీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్: మండోన్నా అశ్వన్ (మండేలా తమిళ ఫిల్మ్)
- ఉత్తమ వినోదాత్మక చిత్రం: తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్
- పర్యావరణ పరిరక్షణపై ఉత్తమ చిత్రం: తలెండా (కన్నడ)
- బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూ: ఫ్యూర్నల్ (మరాఠి)
- ఉత్తమ మేకప్ - టీవీ రాంబాబు ( నాట్యం )
- ఉత్తమ కాస్ట్యూమ్స్: నచికేత్ బార్వే, మహేశ్ శర్లా (హిందీ చిత్రం తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్)
- ఉత్తమ గీత రచన : మనోజ్ ముంతిషిర్ (సైనా – హిందీ)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీష్ నదోడి (కప్పెలా– మలయాళం ఫిల్మ్)
- ఉత్తమ సౌండ్ డిజైనర్: అనుమోల్ భవే (ఎమ్‌ఐ వసంతరావు – మరాఠి)
- ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్– తమిళం)
- ఉత్తమ ఆడియోగ్రఫీ: జాబిన్ జయాన్ (డోలు– కన్నడ)
- ఉత్తమ సౌండ్ డిజైనింగ్ (ఫైనల్ మిక్స్): విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మాలిక్ –మలయాళం)
- ఉత్తమ సంభాషణలు: మడొన్నే అశ్వన్ (మండేలా– తమిళం)
- ఉత్తమ నేపథ్య గాయని: నంజియమ్మ (అయ్యప్పనుమ్ కోషియుమ్ –మలయాళం)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్ దేశ్ పాండే (మీ వసంతరావు– మరాఠి)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుప్రతిమ్ భోల్ (అవిజాత్రిక్– బెంగాలీ)
- మోస్ట్ ఫ్రెండ్లీ ఫిల్మ్ స్టేట్ - మధ్యప్రదేశ్
- ది బెస్ట్ బుక్ ఆన్ సినిమా : ‘ద లాంగెస్ట్ కిస్’
Also read: Chukka Ramaiahకు జీవిత సాఫల్య పురస్కారం
సేమ్ సీన్!
67వ జాతీయ అవార్డుల్లోని సీన్ ఒకటి 68వ జాతీయ అవార్డుల్లోనూ రిపీట్ అయ్యింది. 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు ధనుష్ (‘అసురన్’ చిత్రానికి గాను..). హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (భోన్‌స్లే)లు షేర్ చేసుకున్నారు. ఈసారి కూడా ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు సూర్య (‘సూరరై పోట్రు’ చిత్రానికిగాను..), హిందీ నటుడు అజయ్ దేవగన్ (హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్’ చిత్రానికిగాను..) బెస్ట్ యాక్టర్ అవార్డును షేర్ చేసుకున్నారు. ఇక కెరీర్‌లో సూర్యకు తొలిసారి జాతీయ అవార్డు దక్కగా, అజయ్ దేవగన్‌కు మాత్రం ఇది మూడో అవార్డు. ఇంతకు ముందు ‘జఖ్మ్’ (1998), ‘ది లెజండ్ ఆఫ్ భగత్‌సింగ్’ (2002) చిత్రాలకుగాను ఉత్తమ నటుడు విభాగంలో అజయ్ దేవగన్ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు.
Also read: NITI Aayog's: భారత ఆవిష్కరణల సూచీ– 2021
దివంగత దర్శకుడికి అవార్డు
మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఈ నాలుగు అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు విభాగం కూడా ఉంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిగాను దర్శకుడు కేఆర్ సచ్చిదానందన్ అవార్డుకి ఎంపికయ్యారు. అయితే 2020 జూన్‌లో ఆయన గుండెపోటుతో మరణించడం ఓ విషాదం. దీంతో ఈ సంతోషకర సమయంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రయూనిట్‌కు ఓ లోటు ఉండిపోయింది. ఇక ఈ నాలుగుతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్, ఆడియోగ్రఫీ, ఉత్తమ పుస్తకం.. ఇలా మలయాళ పరిశ్రమకు తొమ్మిది అవార్డులు దక్కాయి.
also read: Oscars Winners 2022: 94వ అకాడమీ అవార్డుల పూర్తి జాబితా
ఓటీటీ చిత్రాల హవా!
68వ జాతీయ అవార్డుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన చిత్రాల జోరు కనిపించింది. ఐదు అవార్డులను గెల్చుకున్న ‘సూరరైపోట్రు’, తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కలర్ ఫోటో’ చిత్రాలు డైరెక్టర్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే రెండు అవార్డులను గెల్చుకున్న తమిళ చిత్రం ‘మండేలా’ ముందుగా టీవీలో ప్రదర్శితమై, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వెళ్లింది. అవార్డులు సాధించిన వాటిలో మరికొన్ని ఓటీటీ చిత్రాలు ఉన్నాయి.
Also read: Oscar Award Winners 2022: ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే.. భారత్‌కు..
తొమ్మిదో అవార్డు
కెరీర్‌లో తొమ్మిదో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. 68వ జాతీయ అవార్డుల్లో తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కిగాను ఎడిటింగ్ విభాగంలో శ్రీకర్ ప్రసాద్‌కు అవార్డు దక్కింది. ఇది ఆయనకు 9వ అవార్డు. గతంలో ‘రాక్’ (1989), ‘రాగ్ బైరాగ్’ (1997), ‘నౌకా కరిత్రము’ (1997), ‘ది టెర్రరిస్ట్’ (1998), ‘వనప్రస్థం’ (2000), ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ (2002), ‘ఫిరాక్’ (2008), 2010లో ‘కుట్టి స్రాంక్’, ‘కమినీ’, ‘కేరళ వర్మ పళస్సి రాజా’లకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డులను దక్కించుకున్నారు.
Also read: Padma Awards 2022: పద్మ పురస్కారాల ప్రదానం
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP