యూజీసీ నెట్ (మే)– 2021 వాయిదా
Sakshi Education
న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే యూజీసీ–నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్)ను వాయిదా వేసినట్లు కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు.
పెరుగు తున్న కేసుల నేపథ్యంలో అభ్యర్థుల క్షేమాన్ని ఉద్దేశించి వాయిదా వేస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు. తదుపరి పరీక్ష తేదీలను 15 రోజుల ముందుగా ప్రకటిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. ఈ పరీక్ష మే 2–17 తేదీల మధ్య జరగాల్సి ఉంది.
Published date : 21 Apr 2021 07:38PM