‘వృత్తి విద్యా సంస్థ’ల్లో ఫీజుల ఖరారు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ అన్–ఎయిడెడ్ వృత్తి విద్యా సంస్థల్లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కోర్సులకు (తెలుగు, హిందీ) 2020–21, 2022–23 సంవత్సరాలకు ఫీజులు నిర్ధారిస్తూ ఉన్నత విద్యా శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఈ ఫీజులు నిర్ధారించింది. కాలేజీల ఆధారంగా రూ.13 వేల నుంచి రూ.20 వేల వరకూ ఫీజులు ఖరారు చేశారు.
Published date : 17 Apr 2021 03:18PM