వలంటీర్లకు బయోమెట్రిక్ హాజరు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు వలంటీర్లకు కూడా బయోమెట్రిక్ విధానంలో ప్రతిరోజూ హాజరు తీసుకునే విధానాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి 11 (సోమవారం)ననుంచి అమలులోకి తీసుకొచ్చింది.
గ్రామ వలంటీర్లు ఇకపై ప్రతిరోజూ గ్రామ సచివాలయానికి వచ్చి బయోమెట్రిక్ ద్వారా తప్పనిసరిగా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు వలంటీర్ల బయోమెట్రిక్ హాజరు కోసం ప్రత్యేక యాప్ రూపొందించినట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కన్నబాబు ‘సాక్షి’కి చెప్పారు.
Published date : 11 Feb 2020 01:14PM