Skip to main content

వీసీల నియామకానికి నోటిఫికేషన్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు యూనివర్సిటీలకు ఉపకులపతుల నియామకానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జనవరి 27 (సోమవారం)ననోటిఫికేషన్ జారీచేసింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలకు వీసీల నియామకానికి ఈ నోటిఫికేషన్ వెలువడింది. బయోడేటాతో కూడిన దరఖాస్తు ఫారాలను అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో జతపరిచి ఫిబ్రవరి 18వ తేదీలోగా ‘ద చైర్మన్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, సీ బ్లాక్, శ్రీమహేంద్ర ఎన్‌క్లేవ్, తాడేపల్లి, గుంటూరు-522510’ చిరునామాకు పంపాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
Published date : 28 Jan 2020 02:45PM

Photo Stories