Skip to main content

విద్యార్థులు చదువుకున్న కళాశాలల్లోనే పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్/ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుకున్న కాలేజీల్లో వారికి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకున్న కాలేజీల్లో కాకుండా వేరే కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఇబ్బందులు పడతారని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఈనెల 8వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశారు. రవాణా సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుకున్న కాలేజీలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఉండవని లేఖలో తెలిపారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం విద్యార్థులు చదువుకున్న కళాశాలల్లోనే పరీక్షలు నిర్వహించేందుకు అంగీకరించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డికి లేఖ రూపంలో బదులిచ్చారు. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్/ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలను వారు చదువుకున్న కాలేజీల్లోనే నిర్వహించేలా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయాలను ఉన్నత విద్యా మండలి ఆదేశించింది.
Published date : 14 Sep 2020 02:28PM

Photo Stories